మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల - వైసీపీ నేతల ఘన స్వాగతం, మాచర్లకు పయనం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు శుక్రవారం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. శనివారం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో ఆయన్ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పిన్నెల్లిని మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్‌తో పాటు ఇతర స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ను పరామర్శించారు. అనంతరం పిన్నెల్లి కారులో బయలుదేరి మాచర్లకు వెళ్లిపోయారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



మలేషియాలో కుంగిన ఫుట్ పాత్ - మ్యాన్ హోల్‌లో పడి కుప్పం మహిళ గల్లంతు, షాకింగ్ వీడియో
మలేషియాలో జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ మహిళ గల్లంతైంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన విజయలక్ష్మి(40) అనే మహిళ కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లారు. రాజధాని కౌలాలంపూర్‌లో ఆమె పూసల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఫుట్ పాత్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగింది. దీంతో ఆమె ఒక్కసారిగా మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మహిళా కమిషన్ ముందు విచారణకు కేటీఆర్ - ఇరువర్గాల పోటా పోటీ నినాదాలు, తీవ్ర ఉద్రిక్తత
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యల క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మహిళా నేతలతో కలిసి బయల్దేరిన ఆయన.. ట్యాంక్ బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు కేవలం కేటీఆర్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నేతలను అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హీరో నాగార్జునకు ఊరట - ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు శనివారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై హీరో నాగార్జున ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నాగార్జునకు చెందిన ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌ ఎందుకు కూల్చినట్టు?హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?
హైదరాబాద్‌లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా... నిర్మాణాలను నేలమట్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి