Viral News in Telugu: యూపీలో ఓ వింత ఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ని పదేపదే పొగుడుతుందన్న కోపంతో భార్యకి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. అయోధ్య కోసం ఈ ఇద్దరూ ఎంతో శ్రమించారని అన్నందుకు ఈ పని చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు. భర్తతో పాటు అత్త కూడా తనపై దాడి చేసిందని, తీవ్రంగా కొట్టారని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు ఉరి వేసి చంపేందుకూ ప్రయత్నించారని పోలీసులకు చెప్పింది.
"2023లో మా ఇద్దరికీ పెళ్లైంది. ఈ మధ్యే నేను కాస్త బయటకు వెళ్తున్నాను. అయోధ్య వద్ద రోడ్‌లు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా అందంగా తీర్చి దిద్దారు. అక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది. ఆ వాతావరణం నాకెంతో నచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని, ప్రధాని నరేంద్ర మోదీని పొగిడాను. అప్పటి నుంచి నా భర్త ప్రవర్తన మారిపోయింది. వెంటనే మా పుట్టింటింకి పంపించేశాడు. వేడి వేడి పప్పు నాపై విసిరేశాడు. ఓ పెద్దావిడ జోక్యం చేసుకుని నచ్చచెప్పడం వల్ల మళ్లీ కాపురానికి వచ్చాను. అయినా నాకు విడాకులు ఇచ్చాడు"
- బాధితురాలు
పెద్ద వాళ్లు వచ్చి చెప్పినా భర్త మాట వినలేదు. యోగి ఆదిత్యనాథ్, మోదీని తిడుతూ అదే సమయంలో తలాక్, తలాక్, తలాక్ అంటూ మూడు సార్లు చెప్పి విడాకులు ఇచ్చాడు. అదే రోజు భార్యను కొట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read: Kolkata: నేనే నేరం చేయలేదు, అమాయకుడిని - కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా కేసు నిందితుడు