Ruhani Sharma on Agra Movie Leaked scenes: రుహానీ శర్మ.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిలసౌ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇందులో అచ్చమైన తెలుగుంటి, సంప్రదాయమైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంటుంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ, రుహానీ శర్మకు మాత్రం ఆశించిన ఆఫర్స్ రాలేదు. ఆడపదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. అయితే ఆగ్రా అనే సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదోక ఆర్ట్ ఫిలిం.
2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రశంసలు అందుకుంది. 2024లో న్యూయార్క్ ఫల్మ్ ఫెస్టివల్లో అవార్డును కూడా అందుకుంది. అయితే ఈ చిత్రంలో శ్రతిమించిన శ్రుంగార సన్నివేశాలు ఉండటంతో ఇండియాలో ఇది స్ట్రీమింగ్‌కి రాలేదు. కానీ ఈ సినిమా పైరసీ లీక్ అవ్వగా రుహానీ శర్మ బోల్డ్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సీన్స్‌తో ఆమెను జడ్జ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆన్‌లైల్లో ఈ సినిమా లీక్ అవ్వడం, తన బోల్డ్స్ సీన్స్‌పై ట్రోల్ చేయడంపై తాజాగా రుహానీ శర్మ స్పందించింది.
ఈ మేరకు ఆమె ఎమోషనల్ నోట్ విడుదల చేసింది. "అందరికి హాయ్! అందరికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నేను నటించిన ఆగ్రా సినిమా లీక్ అయినప్పటి నుంచి నేను ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాను. చెప్పాలంటే నిరుత్సాహం అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే నెలల తరబడి మేం పడ్డ కష్టం, శ్రమ ఇలా వృథా అవ్వడం చూస్తుంటే హార్ట్ బ్రేక్ అవుతుంది. ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయడమంటే చిన్న విషయం కాదు. ఎన్నో నిద్ర రాత్రులు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రూపొందించిన చిత్రమిది. అలాంటి సినిమాను కొన్ని సీన్స్ బట్టి జడ్జ్ చేయడం నిజంగా బాధకలిగిస్తోంది.
ఈ సినిమాకు జీవం పోయడానికి మేము పెట్టిన శ్రమ, కార్చిన చెమట, చిందించిన రక్తం అవేవి గుర్తించకుండ కొన్ని సీన్స్ బట్టి మిమ్మల్ని జడ్జ్ చేయడం దారుణం. ఆగ్రా కేవలం మిగతా చిత్రాల్లాంటి కాదు. 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్లివల్లో ప్రదర్శించబడి అందరి ప్రశంసలు అందుకుంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి పలు అవార్డు అందుకుంది. ఇంత జరిగిన నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఈ సినిమాలో నటించినందుకు, ఈ చిత్రంలో భాగం అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా పూర్తి అర్థం అర్థం చేసుకోలేకపోయినా, ఇలాంటి సినిమాను ప్రశంసించలేకపోతున్నా వారిని నేను ఒక్కటే అడుగుతున్నా. సినిమాను గౌరవించండి.
కల అనేది అంతా ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. నటీనటుల శ్రమను విమర్శిస్తూ వారిని బాధపెట్టడానికి బదులుగా ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలను ప్రొత్సాహించి సెలబ్రేట్ చేసుకోండి. మీ సపోర్టుకు ధన్యవాదాలు" అంటూ రుహానీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక కొందుకు మీకేప్పుడు మా సపోర్టు ఉంటుందని, ఇలాగే మీరు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తూ నటి షైన్ అవ్వాలని కోరుకుంటున్నాం" అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read: నేను అవినీతిపరుడినే - ఏం చేయలేను- నాగార్జున ఇంటర్వ్యూ వైరల్