పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని జమ్ముకశ్మీర్‌ అధికారులు మరోసారి గృహ నిర్బంధంలో ఉంచారు. శ్రీనగర్‌లోని తన నివాసంలోనే ముఫ్తీని హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో అక్కడి పరిణామాలను జమ్ముకశ్మీర్‌తో పోలుస్తూ ముఫ్తీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించి కేంద్రం తన తప్పును దిద్దుకోవాలని అన్నారు. లేకపోతే అఫ్గన్ నుంచి బలమైన అమెరికా పెట్టాబేటా సర్దుకుని వెళ్లిపోయినట్లు.. కేంద్రానికి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతుందని హెచ్చరించారు.


జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎంతో ఓపిక వహిస్తున్నారని ముఫ్తీ అన్నారు. వారి సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి సూచించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తమ ప్రభుత్వ హయాంలో జరిపినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ్ముకశ్మీర్‌పై చర్చలు జరపాలని మెహబూబా డిమాండ్ చేశారు.


ఇప్పటికే పలుమార్లు...


కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడి స్థానిక నేతలను భద్రతా కారణాల దృష్ట్యా గృహ నిర్బంధంలో ఉంచారు. పీడీపీ అధినేత్రి ముఫ్తీని ఇప్పటికే పలుమార్లు హౌస్ అరెస్ట్ చేసింది అక్కడి యంత్రాంగం. 2020లో పక్షం రోజుల్లోనే ముఫ్తీని మూడు సార్లు నిర్బంధించింది ప్రభుత్వం. 


గుప్కార్​ ఏంటీ?


2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కీలక నేతల నిర్బంధం తర్వాత అక్కడి రాజకీయాలు స్తబ్దుగా సాగిపోయాయి. క్రమంగా కశ్మీర్​ ప్రయోజనాల కోసం అంటూ.. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఒకే గొడుగు కిందకు చేరారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏడీజీ) పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి ఈ కూటమి ప్రధాన డిమాండ్లు.


Also Read: Karnataka: బిచ్చగాడి అంతిమయాత్రకు వేలాదిమంది!.. మంత్రులు కూడా అతడ్ని కలిసేవారట!


Also Read: Chhattisgarh Maoist: ఏడు రోజుల తర్వాత ఇంజనీర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు


Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌


Also Read: In Pics: గాల్లో తేలినట్టుందే..! నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో.. ఈ నదిని చూశారా?


Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్‌ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్


Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్


Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'


Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం


Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...


Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...


Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి