ఏడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను మావోయిస్టులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. ఛత్తీస్​గఢ్​ బీజాపూర్ జిల్లాలో ఆయన్ను అపహరించారు మావోయిస్టులు. అయితే ఇవాళ ప్రజాకోర్టులో మీడియా ముందు లక్రాను విడుదల చేశారు.


ఏడు రోజులు గాలింపు..


ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారు. గత ఏడు రోజులుగా మీడియా, పెద్దలు ఇంజినీర్​ను విడుదల చేయాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీర్ ఆచూకీ కోసం భార్యతో సహా మీడియా సిబ్బంది 7 రోజుల పాటు అడవుల్లో గాలించారు.


పరిశీలనకు వెళ్తే పట్టికెళ్లిపోయారు..


బీజాపూర్ జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద నిర్మిస్తోన్న రోడ్జు పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా, అటెండర్​ లక్ష్మణ్ పర్తగిరిని మావోయిస్టులు కిడ్నాప్​ చేశారు. 


అయితే అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని రెండు రోజుల అనంతరం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉండగా తాజాగా ఇవాళ ప్రజాకోర్టులో విడులదయ్యారు.


ఉద్రిక్త పరిస్థితులు..


ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇటీవల ఆర్కే చనిపోయిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉంది. అయితే భద్రత మధ్య అభివృద్ది పనులు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గోర్నాలో కొంత మంది కాంట్రాక్టర్లు రోడ్లు వేస్తున్నారు. ఈ పనులు పరిశీలించేందుకు అప్పుడప్పుడూ ఇంజినీర్లు వెళ్తున్నారు. 


Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌


Also Read: In Pics: గాల్లో తేలినట్టుందే..! నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో.. ఈ నదిని చూశారా?


Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్‌ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్


Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్


Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'


Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం


Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...


Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...


Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి