Coromandel Train Accident:



గతంలోనూ ప్రమాదాలు..


ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత భారీ ప్రమాదం ఇదే. పట్టాలు తప్పి పడిపోవడం వల్ల వందలాది మంది ప్రాణాలు నిద్రలో ఉండగానే గాల్లో కలిసిపోయాయి. ఇంకొందరు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకేచోట మూడు ప్రమాదాలు జరగడం వల్ల  సిగ్నలింగ్ వ్యవస్థపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతవేగంతో వస్తున్న రైలు ఎందుకు పట్టాలు తప్పింది అన్నదే ఇప్పటికీ అంతుతేలని ప్రశ్న. ఇప్పటికిప్పుడు ప్రమాద కారణాలు చెప్పలేమని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు. గతంలో చాలా సార్లు ఇలా రైళ్లు పట్టాలు తప్పి వందలాది మందిని బలి తీసుకున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది..? రైళ్లు పట్టాలు (Derailment) తప్పడానికి కారణాలేంటి..? ప్రస్తుతం దీనిపై డిబేట్‌ నడుస్తోంది. 


ఎందుకు పట్టాలు తప్పుతాయి..?


2003 నుంచి ఇప్పటి వరకూ జరిగిన రైలు ప్రమాదాలకు కామన్ రీజన్...పట్టాలు తప్పడం. 80% యాక్సిడెంట్స్‌ ఈ కారణంగానే జరిగినట్టు గతంలోనే పలు నివేదికలు స్పష్టం చేశాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా గతంలో ఇదే విషయాన్ని వెల్లడించింది. 2020 తరవాత దాదాపు 10 ప్రమాదాలు జరిగాయి. అయితే...వీటిలో ఎక్కువగా గూడ్స్ రైళ్లే ఉన్నాయి. ఒక్క గూడ్స్‌ ట్రైన్‌లో పదుల సంఖ్యలో కోచ్‌లు అదుపు తప్పి పడిపోయాయి. ట్రాక్ ఫెయిల్యూర్ కారణంగానే రైళ్లు పట్టాలు తప్పుతాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే...Rail Fracture.దీంతో పాటు వెల్డ్ ఫెయిల్యూర్ (Weld Failure) కూడా రైలు ప్రమాదానికి కారణమవుతోంది. రైల్ ఫ్రాక్చర్ అంటే...పట్టాలు డ్యామేజ్ అవడం. సాధారణంగా రైలు పట్టాలని స్ట్రాంగ్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఎంత బరువునైనా తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాదు. టెంపరేచర్‌ ఎక్కువైతే పట్టాలు వేడెక్కుతాయి. ఎక్స్‌పాండ్ అవుతాయి. ఇదే ప్రమాదాలకు కారణమవుతుంది. అయితే...రైలు పట్టాలు తప్పడానికి ఇదొక్కటే కారణం కాకపోవచ్చు. తయారు చేసినప్పటి నుంచి వాటిని ఇన్‌స్టాల్ చేసే వరకూ...చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ చిన్న లోపం తలెత్తినా...అది భారీ ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇక మెయింటెనెన్స్ లేకపోవటమూ మరో కారణం. అవే పట్టాలను ఏళ్ల పాటు వాడడం వల్ల అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా బిజీ ట్రాక్స్‌పై ఈ డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి ట్రాక్స్‌ని తరచూ చెక్ చేస్తూ ఉండాలి. 


జాయింట్స్‌ ఫెయిల్యూర్..


ట్రాక్స్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని చోట్ల బోల్ట్‌లతో వాటిని కనెక్ట్ చేస్తారు. వీటినే బోల్టెడ్ జాయింట్స్ (Rail Bolted Joints) అంటారు. ఫిష్ బోల్ట్ జాయింట్స్‌ డ్యామేజ్‌ అయినా...ట్రాక్స్‌ వదులుగా అయిపోతాయ్. ఎప్పుడైతే ట్రైన్‌ వాటిపైకి వస్తుందో వెంటనే అవి పక్కకు తొలగిపోతాయి. ఫలితంగా...ట్రైన్ అదుపు తప్పి కింద పడిపోతుంది. కొన్ని పట్టాలను కనెక్ట్ చేయడానికి వెల్డింగ్ చేస్తారు. ఈ వెల్డింగ్ సరిగ్గా చేయకపోయినా...ప్రమాదాలు తప్పవు. దీన్నే వెల్డ్ ఫెయిల్యూర్ అంటారు. బిజీ ట్రాక్స్‌పై స్పీడ్ కంట్రోల్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నప్పటికీ...దీనిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.  


Also Read: Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?