పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా, సీత దేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మేకర్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

  


ఓం రౌత్ ట్వీట్ పై నెటిజన్ల ట్రోలింగ్


సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం రోజుకో కొత్త విషయం వెల్లడిస్తోంది. తాజాగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రంలోని  హనుమంతుడి(దేవదత్తా నాగే)  కొత్త పోస్టర్ ను  ఐదు భాషలలో  ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. హిందీ మినహా మిగతా భాషల్లో ట్రాన్స్ లేషన్ తప్పు తప్పుగా వచ్చింది.  "హమ్ హై కేసరి, క్యా బరాబరీ (మేము కుంకుమపువ్వులం, మాకు సమానం లేదు)" అనే హిందీ వాక్యం మినహా, తమిళం, తెలుగు, మలయాళం,  కన్నడ భాషలలో అనువాదం తప్పుగా వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు దిగారు. "ప్రియమైన ఓం రౌత్, ఇది గిబ్బరిష్, తెలుగు కాదు. తెలుగు అనువాదానికి అర్థం లేదు" అంటూ ఓ నెటిజన్లు విమర్శించారు. చాలా మంది నెటిజన్లు దర్శకుడడితో పాటు చిత్ర బృందానికి కూడా సరైన శ్రద్ధ లేదని విమర్శించారు.


“మీకు రామాయణం తెలియదు, మాకు అర్థమైంది. కానీ, కనీసం మిమ్మల్ని సరిదిద్దగల తెలుగు వ్యక్తిని నియమించుకోండి” అంటూ సూచించారు.  తమిళ్, మలయాళంలోనూ లోపాలు ఉన్నాయని చాలా మంది నెటిజన్లు విమర్శించారు. మొత్తంగా ఓం రౌత్ అన్ని భాషలను చంపారని మరికొంత మంది ట్వీట్ చేశారు. ఇంత ట్రోల్ అవుతున్నా, ఓం రౌత్ మాత్రం తన ట్వీట్ ను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం విశేషం.   






జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల


ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' దేశంలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రాల్లో ఒకటిగా నిలువబోతోంది. ‘ఆదిపురుష్’లో రాఘవగా ప్రభాస్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవదత్ నాగే హనుమంతుడిగా నటించారు. అజయ్-అతుల్ సంగీతం సమకూర్చారు. టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.  ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 3డీ, ఐమాక్స్ ఫార్మాట్స్ లో ఐదు భాషల్లో విడుదల కానుంది. . 


నెగెటివ్ ప్రచారంతో సినిమా విడుదల వాయిదా


వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది.  టీజర్ విడుదల తర్వాత తీవ్ర స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి పేలవమైన VFX అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. సినిమాపై ఉన్న హైప్ దెబ్బతినడంతో విడుదలను కొంత కాలం వాయిదా వేశారు. రీసెంట్ మళ్లీ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేలా చేశారు. ఇటీవల విడుదలైన కొత్త పోస్టర్లు, పాటలు సినిమాకు మొదట్లో వచ్చిన కొన్ని ఎదురుదెబ్బలను తిప్పికొట్టడంలో సహాయపడ్డాయి.