జేమ్స్ మ్యాంగోల్డ్ దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’. అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హారిసన్ ఫోర్డ్ తో పాటు ఫోబ్ వాలర్-బ్రిడ్జ్, ఆంటోనియో బాండెరాస్, జాన్ రైస్-డేవిస్, టోబి జోన్స్, బోయ్డ్ హోల్‌బ్రూక్, మాడ్స్ మిక్కెల్‌సెన్ కీలక పాత్రలు పోషించారు. జేమ్స్ మ్యాంగోల్డ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కాథ్లీన్ కెన్నెడీ, ఫ్రాంక్ మార్షల్, సైమన్ ఇమాన్యుయెల్ నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, జార్జ్ లూకాస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
అమెరికా కంటే ముందే భారత్ లో విడుదల
భారీ అంచనాలతో కూడిన ఈ ఐకానిక్ ఫ్రాంఛైజ్ కు సంబంధించి చివరి ఇన్‌స్టాల్‌మెంట్ జూన్ 29న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ ప్రకటనతో భారతీయ సినీ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా రూపొందిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ అమెరికా కంటే ఒక రోజు ముందుగానే భారత్ లో విడుదల కానుంది.
35 ఏండ్ల యువతిగా కనిపించనున్న ఇండియానా జోన్స్
'ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ' చిత్రంలో 25 నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. ఇందులో ఇండియానా జోన్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 35 ఏళ్ల యువతిగా కనిపించనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో 79 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగించినట్లు త వెల్లడించారు.
ఆర్కియాలజిస్ట్ గా కనిపించనున్న లెజెండరీ హీరో హారిసన్ ఫోర్డ్
లెజెండరీ హీరో హారిసన్ ఫోర్డ్ ఆర్కియాలజిస్ట్ గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అడ్వెంచర్ సినిమాను వెండితెరపై చూసి అద్భుత థ్రిల్ ను పొందే అవకాశం ఉందని చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ జూన్ 29న భారతతీయ థియేటర్లలోకి రానుండగా, ఒక రోజు తర్వాత అమెరికన్ థియేటర్లలో సందడి చేయనుంది.
స్టీవెన్ స్పీల్‌బర్గ్-దర్శకత్వం వహించిన అడ్వెంచర్ ఫ్రాంచైజీ 1981లో తన మొదటి చిత్రాన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి ఫోర్డ్ పురావస్తు శాస్త్రవేత్తగా నటించాడు. మొదటి మూడు చిత్రాలు 80వ దశకంలో విడుదలయ్యాయి, నాలుగో చిత్రం 2008లో విడుదలైంది. ఐదవది 2023(జూన్ 29న)లో విడుదల కానుంది. అయితే ఈ చివరి చిత్రానికి జేమ్స్ మ్యాంగోల్డ్ దర్శకత్వం వహించారు.
Read Also: అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ