సీఆర్‌పీసీ సెక్షన్-107 కింద నమోదైన పోలీసులు కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 107 కింద తహశీల్దార్లకు బైండోవర్ చేసే అధికారం ఉంది. అయితే పోలీసులు ఆ సెక్షన్‌ను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో పరుశురాములు అనే వ్యక్తిపై సీఆర్‌పీసీ సెక్షన్-107 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేశారు. ఇది చట్ట విరుద్ధమని ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : వినాయక మండపాలు పెట్టుకోవచ్చు..!
ఈ పిటిషన్‌పై విచారణలో అల్లర్లను సృష్టించే వారిని సీఆర్‌పీసీ సెక్షన్-107 కింద బైండోవర్ చేసే అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్-107 కింద కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది.
Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కష్టమే..!
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరినై అదుపులోకి తీసుకోవాలంటే ముందుగా అత్యంత సులువుగా సెక్షన్ 107ను ప్రయోగిస్తున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఈ సెక్షన్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. పరుశురాములు అనే వ్యక్తిపైనా అదే తరహాలో కేసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఆయన న్యాయపోరాటం చేశారు. పరుశురాములు పోరాట ఫలితంగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న అనేక కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు రద్దయ్యే అవకాశం ఉంది.
Also Read : జగన్‌కు గుదిబండగా మారిన ఐదు హామీలేంటి..?
ప్రస్తుతం పరుశురాములు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఇదే తరహాలో నమోదైన కేసులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. డీజీపీ ఈ అంశంపై అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఆయన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆదేశాలు జారీ చేసిన తరవాత సెక్షన్ 107 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు అనేక మంది బాధితులకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో విరుచుకుపడే పోలీసులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదేనని భావిస్తున్నారు.