పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ సమకూర్చే తల్లిదండ్రులు వారు ఏదైనా సాధించాలని కలలు కంటారు. ఎప్పటికీ వారు ఉన్నత స్థానంలో స్థిరపడాలనే ఆశిస్తుంటారు. అదే పిల్లలకు అరుదైన గుర్తింపు వస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. ఉన్నత విద్యలో తమ బిడ్డ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఎంతో మంది తల్లిదండ్రుల ఆశ. కానీ, కొంత మంది కలలు మాత్రమే నెరవేరుతుంటాయి. ఇలాంటి అనుభూతినే అనంతపురానికి చెందిన తల్లిదండ్రులు పొందారు. ఎందుకంటే వారి కుమారుడు ఎంసెట్‌లో ఏకంగా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు.
దీంతో ఆ కుటుంబంలో, బంధువులు కుటుంబాల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెన హళ్లి గ్రామానికి చెందిన శ్రీ నిఖిల్ అనే విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పట్టుదలతో ఎంసెట్ స్టేట్ ర్యాంక్ సాధించాడు. గత నెల 26న విజయవాడలో ఎంసెట్ రాసిన నిఖిల్ స్టేట్ రాంక్ సాధించి ఆ కుటుంబాన్ని ఆనంద పరిచాడు.
తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుజాతలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హిందూపురంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి వరకు విద్య అభ్యసించిన నిఖిల్ గుడివాడలో ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. చదువులో ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండేవాడు. అయితే, ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇలా ఎవరూ ఊహించని విధంగా నిఖిల్ స్టేట్ ర్యాంక్ సాధించడం తమకు కోట్లాది రూపాయల విలువైన సంతోషం వచ్చిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు మరపురాని అని ఇది తమ జీవితంలో గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: YS Sharmila: జారిపడ్డ మందకృష్ణ.. ఇంటికెళ్లి వైఎస్ షర్మిల పరామర్శ, ఆ సభకు రావాలని ఆహ్వానం
తమ కుమారుడి జీవిత లక్ష్యం సైంటిస్ట్ కావడం అని తల్లిదండ్రులు వివరించారు. ఆ సంకల్పాన్ని ఆ దేవుడు నెరవేర్చాలని కోరుకున్నారు. ఏది ఏమైనా హిందూపురం ప్రాంతానికి చెందిన విద్యార్థి ఎంసెట్‌లో స్టేట్ ర్యాంక్ సాధించడం పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.