కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ప్రభుత్వాల ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచి చూడదని హైకోర్టు కామెంట్ చేసింది. థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోందన్న హెచ్చరికలున్నాయని గుర్తుచేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని, కరోనాతో ఇప్పటికే అనేక మంది చనిపోయారని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నత్త నడకన కాకుండా వేగంగా కదలాలని, కరోనా కట్టడికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. 


Also Read: TS High Court: నిమజ్జన సమస్యలపై శ్రద్ధ లేదా? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం


Also Read: CBI : "సీబీఐ"కి పంజరం నుంచి విముక్తి ఎప్పుడు ? న్యాయవ్యవస్థ ఇవ్వగలదా..?


ఇప్పటికే కరోనాతో అనేక మంది చనిపోయారని హైకోర్టు పేర్కొంది. గత అనుభవాలతో అయినా ఆ నష్టాన్ని నివారించాలని చెప్పింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వాలు ప్రజల పట్ల మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. మేం ఆదేశించినా నిపుణుల కమిటీ భేటీ నిర్వహించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.  నిర్లక్ష్యం కనిపిస్తోందని... జనగామ, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఒక శాతానికి మించి ఉందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రేటు వెంటనే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 


Also Read: TRS Harish: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనకు హరీష్ ఎందుకెళ్లలేదు ? కేసీఆర్ ఆహ్వానించలేదా ?


Also Read: KTR On Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు


థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైకోర్టుకు డీహెచ్‌ నివేదిక సమర్పించారు. నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదని, కరోనా మందులు అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోందని కోర్టుకు చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. పిల్లల చికిత్సకు అవసరమైన పడకలు, ఇతర వసతుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్‌, కేంద్ర నోడల్‌ అధికారి కోర్టులో హాజరుకావాలంది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. 


Also Read: TS News: ప్రేమ పెళ్లి చేసుకుందని కడుపులో బిడ్డను చంపేశారు.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం..


Also Read: Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభం