AP సీఎం వైఎస్ జగన్‌కు సవాల్‌గా మారిన 5 హామీలు.. పరిష్కారం ఏమిటి ?
Continues below advertisement
ఎన్నికల సమయంలో సంక్షేమం కోసం హామీలిచ్చిన పథకాల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సిద్ధపడుతున్నారు. మాట ఇచ్చాం, చేయాల్సిందే అంటూ అప్పుల తీసుకొచ్చి పథకాలను నడిపేందుకు AP ప్రభుత్వం ఎన్ని తిప్పలైనా పడుతోంది. కోవిడ్, లాక్‌డౌన్‌లో జనజీవనం దారుణంగా ప్రభావితమైనా, ఏపీలో పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉండటానికి ఈ నగదు బదిలీ పథకాలే కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆరు నూరైనా సంక్షేమం సాగుతుంది సరే, మరి వివిధ వర్గాలకు జగన్ ఇచ్చిన హామీల సంగతేంటి ? రెండున్నరెళ్లు కావస్తున్న సమయంలో జగన్‌కు ఈ 5 హామీలు సవాల్‌గా నిలుస్తున్నాయి.
Continues below advertisement