Kadiri News: కుంటలో బడి కట్టారు.. పాఠశాలను ముంచారు.. విద్యార్థులను భయపెట్టారు
నిబంధనలకు విరుద్ధంగా కుంటలో బడి కట్టారు. ఇప్పుడు చిన్నపాటి వర్షానికే బడి నీట మునుగుతోంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలకు రావడానికే విద్యార్థులు భయపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఎస్సీ , ఎస్టీ గురుకుల పాఠశాల ఆవరణంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. 20 రోజులుగా పాఠశాలను తెరవలేదు. నీరు తగ్గడంతో బడిని తెరిచారు. ఎప్పుడు మళ్లీ వర్షం వచ్చి బడి నీట మునుగుతుందో అని భయపడి విద్యార్థులు రావడం లేదు. 258 మంది హాజరు కావాల్సిన ఉన్న పాఠశాలకు 13 మందే వచ్చారు. హాజరైన పిల్లలు మరుగుదొడ్లకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనిపించడం లేదు.