ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. అవసరం అయితే నైట్ కర్ఫ్యూలను పెట్టాలని తాజాగా లేఖ రాసింది.  ప్రస్తుతం కోరనా దేశంలో పూర్తిగా కట్టడిలో ఉంది. అతితక్కువ కేసులు నమోదవుతున్నాయి. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపైనే అందరూ ఆదోళనచెందుతున్నారు. శరవేగంగా విస్తరించే వేరియంట్‌గా నిపుణులు చెబుతూండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.


Also Read : సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?


ఒమిక్రాన్ వ్యాప్తిని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలి. కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించింది. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని  స్పష్టం చేసింది. 


Also Read : సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే


ప్రస్తుతం కరోనాకట్టడిలోనే ఉన్నప్పటికి  దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంది, కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉంది.  మిగతా 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదవుతోంది. అందుకే అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు.


Also Read: Wife Call Recording Crime : భార్య ఫోన్ కాల్‌ను అనుమతి లేకుండా రికార్డ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ? ఇదిగో పంజాబ్- హర్యానా హైకోర్టు తీర్పు !


విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ వైరస్ బారిన పడి వారిసంఖ్య అనూహ్యంగా ఉంటోంది. కరోనా సెకండ్ వేవ్ విషయంలో ఆంక్షల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ సారి అలాంటి తప్పిదం జరగకూడదని కేంద్రం భావిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్‌ను వేగం పెంచడంతో పాటు నైట్ కర్ఫ్యూల్లాంటి వాటిని సిఫార్సు చేస్తోంది. 


Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి