Narendra Modi  declared the preservation and development of the Pali language :  పాళీ భాషతో పాటు ఆ భాషలో  రాసిన పవిత్ర గ్రంథాలు, బుద్ధుని బోధనలను సంరక్షించేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పాళీని శాస్త్రీయ భాషగా గుర్తించే అంతర్జాతీయ అభిధామ దివస్ ను నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.  బుద్ధుని బోధనలను ప్రపంచానికి తెలియజేసిన భాష పాళీ అని తెలిపారు.  ఇప్పుడు పాళీ భాషకు శాస్త్రీయ హోదా ఇచ్చామన్నారు.  


ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి పాళీ భాష కీలకం


ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి పాళీ కీలకమని ప్రధాని మోదీ అన్నారు.  భాష అనేది కేవలం కమ్యూనికేషన్ పద్ధతి కాదని, అది ఒక నాగరికతకు, దాని సంస్కృతికి, దాని వారసత్వానికి ఆత్మ అని మోదీ తెలిపారు.  పాళీ భాషను   సజీవంగా ఉంచడం బుద్ధుని సందేశాన్ని ప్రపంచానికి అందించే బాధ్యత మనమీద ఉందన్నారు.  పాళీ భాష ప్రస్తుతం వాడుకలో లేనప్పటికీ  సాహిత్యం, కళలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలను వ్యక్త పరుస్తోందని  అదే దాని గుర్తింపు అని  చెప్పారు. భారత ప్రభుత్వం పాళీ భాషను పరిరక్షిస్తుంది, ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. 


రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం


బౌద్ధ వారసత్వాన్ని  పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు


స్వాతంత్య్రానికి ముందు శతాబ్దాల వలస పాలన, ఆక్రమణదారులు భారతదేశ అస్తిత్వాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత  'బానిస మనస్తత్వం' ఉన్నవారు  అలా చేశారని విమర్శించారు. భారత బౌద్ధ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి  అన్ని ప్రయత్నాలు చేస్తామని  గత కొన్నేళ్లలో 600కు పైగా కళాఖండాలను భారత్ కు తీసుకొచ్చామని వాటిలో ఎక్కువ భాగం బౌద్ధ వస్తువులేనని ప్రధాని మోదీ గుర్తు చేశారు. యాప్స్, డిజిటలైజేషన్, ఆర్కైవల్ రీసెర్చ్ ద్వారా పాళిని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని ..పాళీని అర్థం చేసుకోవడానికి విద్యాపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రయత్నాలు రెండూ అవసరం అన్నారు.  బుద్ధధర్మాన్ని అర్థం చేసుకోవడంలో పండితులు, విద్యావేత్తలు ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.  



సంస్కృతి, విలువలు, మూలాల పట్ల దేశ యువత గర్వపడాలి


బుద్ధుని వారసత్వాన్ని పునరుద్ధరించడంలో చేసే కృషి అంటే  భారతదేశం తన అస్తిత్వాన్ని పునరుద్ధరించుకవడమేనని మోదీ అన్నారు.  వేగవంతమైన అభివృద్ధి మరియు , గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించడంలోనే ఉంటుందన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచానికి నాయకత్వం వహించడమే కాకుండా వారి సంస్కృతి, విలువలు, మూలాల పట్ల గర్వపడాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. 


హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం - హాజరైన ఎన్డీఏ నేతలు - చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్


అభిధామ దివసా కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి  రీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు.  భిధామ దివస్ ను బుద్ధ ధర్మాన్ని అనుసరించే వారికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి చాలా ముఖ్యమైన రోజుగా అభివర్ణించారు. శాంతి, సౌభాగ్యం, సామరస్యంతో నిండిన జీవితాన్ని గడపాలని బౌద్ధం పిలుపునిచ్చిందన్నారు.