Rohingya Congress Connection : పొరుగుదేశాల నుంచి భారత్‌లోకి వచ్చే రోహింగ్యాలు పెను ముప్పుగా మారుతున్నారు. అత్యంత తీవ్రమైన నేరగుణం ఉండే ముస్లిం వర్గానికి చెందిన రోహింగ్యాలను కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సమర్థిస్తున్నారు. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నుహ్ జిల్లాలోని జిర్కా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన కాంగ్రెస్ మమ్మూన్ ఖాన్ రోహింగ్యాలను ఎలా కాపాడుతున్నారో వెలుగులోకి వచ్చింది. ముస్లిం ఓటర్లు 80 శాతం ఉండే జిర్కా అసెంబ్లీ సెగ్మెంట్‌లో మమ్మూన్ ఖాన్ 98,441 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈయనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. UAPA కేసు కూడా ఉంది. మత ఘర్షణలు రేపడంలో ఎక్స్‌పర్ట్ అని చెబుతారు. గత ఏడాది జూలైలో నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలకు కారణం ముమ్మాన్ ఖాన్ కారణం అని కేసులు నమోదయ్యాయి.
హర్యానాలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన రోహింగ్యాలు
ముస్లిం వర్గం ఏకపక్ష మద్దతతోనే మమ్మూన్ ఖాన్ అంత భారీ విజయం సాధించారు. ఆయనకు దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు కూడా మద్దతుగా నిలిచారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నుహ్ జిల్లాల్లో నివాసం ఉండే 80 శాతం మంది ముస్లిం ప్రజల్లో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలు కూడా గణనీయ సంస్ఖలో ఉంటారు. గతంలో జరిగిన అల్లర్ల సమయంలో పలువురు అనుమానిత రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు.
రోహింగ్యాల పిల్లలకు మదర్సాలో శిక్షణ
తాజాగా నుహ్‌లోని ఓ మదర్సాలో ఇల్లిగల్ ఇమ్మిగ్రెంట్స్ పిల్లలకు చదువుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఒక్క ఏరియాలోనే నాలుగు వందల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలు టీచర్లు విద్యార్థులను మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారుగా సంబోధిస్తున్నారు. వారిని గెస్టులుగా చెబుతున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత కొంత మంది జర్నలిస్టులు ఆ మదర్సాను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడారు. అక్కడ చదువుకుంటున్న చాలా మంది హాఫిజ్‌లు కావాలని కోరుకున్నారు కానీ.. డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కోరుకోలేదు.
సరైన పత్రాలు లేని రోహింగ్యాలు వందల్లో !
మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఎలాంటి వీసా, పాస్ పోర్టులు లేకుండా ఇండియాలోకి ఎలా వచ్చామో ఓ రోహింగ్యా మీడియా ప్రతినిధులకు వివరించారు. అతని వద్ద ఉన్న ఒకే ఒకక్ పత్రం.. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన రెఫ్యూజీ కార్డు. భారత్ లో ఉండటానికి అతని వద్ద ఎలాంటి పత్రాలు లేవు. అయినా అతను నిరభ్యంతరంగా ఉంటున్నాడు. వారు ఉంటున్న ఏరియాల్లోనే మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి !
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని మరోసారి స్పాట్ లైట్‌లోకి తెస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తెలిసే అక్రమంగా వలస వచ్చిన వారికి మద్దతుగా ఉంటోందన్న అభిప్రాయం దీని వల్ల కలుగుతోంది. రోహింగ్యాలకు మద్దతుగా కాంగ్రెస్ ఉంటుందా ? రోహింగ్యాలను ఆ పార్టీ ఓటు బ్యాంక్‌గా మార్చుకుందా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.