CM Hemant Soren: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ గురువారం ఈడీ ఆఫీసుకు హాజరు కావాల్సి ఉంది. అక్రమ మైనింగ్ కేసులో విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని సీఎం సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే సీఎం హాజరుకారని సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నవంబర్ 3న విచారణకు హాజరు కావాలని సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని సమన్లలో స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది.
జులైలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఈడీ పంకజ్ మిశ్రా బ్యాంకు ఖాతాల నుంచి 11.88 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అనంతరం జులై 19న అతడ్ని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది.
2019 ఎన్నికల్లో
2019లో జరిగిన ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమి మొత్తం 47 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 స్థానాలు ఎక్కువ సాధించింది. ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోన్న హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81స్థానాలు. జేఎంఎం 30 సీట్లలో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒకచోట గెలుపొందాయి. భాజపా 25, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 1995 నుంచి జంషెడ్‌పుర్ తూర్పు నుంచి 5 సార్లు ప్రాతినిథ్యం వహించిన ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత రఘుబర్‌దాస్ ఓటమిపాలయ్యారు. రఘుబర్‌దాస్‌పై 8 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థి సరయిరాయ్. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనకు భాజపా టికెట్ నిరాకరించినందున తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు.
Also Read: Bypoll Election 2022: ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్