Bypoll Election 2022: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), హరియాణాలోని అదంపుర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.


అధికార ఎమ్మెల్యేలు మరణించడం లేదా పార్టీ మారడం లేదా క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలడంతో ఈ ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.


టాప్- 10 పాయింట్లు




    1. హరియాణా అదంపుర్‌లో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ చిన్న కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి భాజపాలోకి మారడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు భాజపా అభ్యర్థిగా బిష్ణోయ్ కుమారుడు భవ్య పోటీ చేస్తున్నారు.

    2. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. భజన్ లాల్ మనవడు పోటీ చేస్తోన్న ఈ స్థానంలో చురుకుగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 

    3. భాజపాతో జేడీ(యూ) విడిపోయిన తర్వాత ఏర్పడ్డ నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ 'మహాకూటమి' ప్రభుత్వానికి తొలి పరీక్ష జరుగుతోంది. బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొకామా స్థానం నుంచి భాజపా తొలిసారి పోటీ చేస్తోంది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవిపై బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి పోటీ చేస్తున్నారు, ఆమె భర్త అనంత్ సింగ్ అనర్హత ఉపఎన్నికకు దారితీసింది.

    4. గోపాల్‌గంజ్‌లో మరణించిన పార్టీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ భార్య కుసుమ్ దేవిని భాజపా పోటీకి దింపింది. ఆర్‌జేడీ.. మోహన్ గుప్తాను నిలబెట్టగా, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా లాలూ యాదవ్ బావ సాధు యాదవ్ భార్య ఇందిరా యాదవ్ పోటీ చేస్తున్నారు.

    5. ముంబయిలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని శివసేన అభ్యర్థి రుతుజా లట్కే సునాయాసంగా గెలుస్తారని భావిస్తున్నారు. ఇటీవల శివసేనలో చీలిక తర్వాత మొదటిసారిగా పోటీ నుంచి భాజపా వైదొలిగింది. ఆమె భర్త, శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే ఈ ఏడాది మే లో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

    6. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్ నియోజకవర్గం, బీజేడీ పాలిత ఒడిశాలోని ధామ్‌నగర్ నియోజకవర్గాలను నిలుపుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులను రంగంలోకి దింపినందున సానుభూతి ఓట్లపై భాజపా ఆధారపడింది. సెప్టెంబర్ 6న భాజపా ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో గోలా గోరఖ్‌నాథ్ స్థానం ఖాళీ అయింది.






  1. తెలంగాణలోని మునుగోడులో భాజపా, అధికార టీఆర్‌ఎస్ దూకుడుగా ప్రచారం చేశాయి. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాషాయ పార్టీ టిక్కెట్‌పై పోరాడుతున్నారు.

  2. మునుగోడులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ భాజపా తరఫున కోమట్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

  3. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మునుగోడుపై "వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల" ద్వారా "నిశితంగా నిఘా" ఉంచాలని ఎన్నికల సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిని కోరింది.


Also Read: Kejriwal On PM Modi: ఢిల్లీలో పొల్యూషన్ పాలిటిక్స్, భాజపా ఆప్ మధ్య మాటల యుద్ధం