కరోనా ఎంతో మందిని ఎడబాటుకు గురి చేసింది. ఆ ఎడబాటు నుంచి ఎన్నెన్నో కొత్త కొత్త ప్రేమ కథలు వెలుగుచూశాయి. తాజాగా సముద్రాల్ని సైతం ఈది.. భార్యను చేరాలనుకున్న ఓ వియత్నం భర్త ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 


వియత్నాంకు చెందిన హో హెయాంగ్‌ హుంగ్‌, అతని భార్య కరోనా వల్ల ఎడబాటుకు గురయ్యారు. అతనేమో వియత్నాంలో ఉంటే.. భార్య ఉద్యోగరీత్యా ముంబయిలో ఉండిపోయింది. వరుస లాక్‌డౌన్‌లు, ప్రయాణ ఆంక్షల వల్ల వారిద్దరూ గత రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. దీంతో హుంగ్‌ భార్య మీద ఉన్న ప్రేమతో ఇంతటి సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. అతను మొదట వియత్నాం నుంచి థారులాండ్‌లోని బ్యాంక్‌కు చేరాడు. అక్కడి నుంచి ముంబయి విమానం ఎక్కాలనుకుంటే.. తనకు వీసా లేదు. అధికారుల్ని అభ్యర్థించినా.. ససేమిరా అన్నారు. దీంతో అతను బ్యాంకాక్‌లో బస్‌ ఎక్కి.. పుకెట్‌ చేరుకున్నాడు. అక్కడే తన దగ్గరున్న కొద్ది డబ్బుతో రబ్బరు పడవను కొన్నాడు.


ఐఏఎస్ అధికారుల జీతం ఎంతో తెలుసా ? ఐటీ ఉద్యోగులతో పోలిస్తే


 ఆ రబ్బరు బోటులోనే రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి రావాలనుకున్నాడు హుంగ్‌. కానీ సముద్రయానానికి కీలకమైన కంపాస్‌లు, జీపీఎస్‌ పరికరాలు వంటివేవీ హుంగ్‌ దగ్గర లేవు. అయినా మొండి ధైర్యంతో ప్రయాణాన్ని ప్రారంభించాడు.  ఆ ప్రయాణంలో ఈదురుగాలులకి ముందుకెళ్లాల్సిన పడవ అక్కడక్కడే తిరిగింది. కొన్నిసార్లు వెనక్కి వెళ్లింది. ఇలా అతని ప్రయాణం 18 రోజుల్లో 80 కిలోమీటర్లు మాత్రమే సాగింది. గాలి వానలో.., వాన నీటిలో పడవ ప్రయాణం అని పాడుకుంటూనే ఉన్నాడు. సముద్రంలోనే ఉన్నాడు. 


మందు తాగే వాళ్లు మహా పాపులు- అసలు భారతీయులే కాదు: సీఎం కామెంట్స్ వైరల్


చివరికి  మార్చి 23న సిమిలన్‌ దీవుల వద్ద జాలర్ల బృందానికి కంటపడ్డాడు. వారు నౌకాదళానికి సమాచారమివ్వగా.. వెంటనే నేవీ సిబ్బంది.. రంగంలోకి దిగి హుంగ్‌ని కాపాడారు.  భార్య మీద ప్రేమతో.. సముద్ర మార్గంలో రెండు వేల కి.మీ సాహోసోపేత ప్రయాణాన్ని ప్రారంభించాడు కానీ ఆ భర్త ముంబైకి చేరుకోలేకపోయాు. ఇప్పుడు అతని గురించి తెలిసి అతని భార్య అయినా వియత్నం వెళ్తుందో లేదో .. వాళ్లు కలుసుకుంటారో లేదోనని చాలా మంది టెన్షన్ పడుతున్నారు.  ఈ విషయంపై వియత్నం మీడిాయలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ యంగ్ భార్య వీటిని చూసిందో లేదో ..?