ABP  WhatsApp

Nitish Kumar: మందు తాగే వాళ్లు మహా పాపులు- అసలు భారతీయులే కాదు: సీఎం కామెంట్స్ వైరల్

ABP Desam Updated at: 31 Mar 2022 03:42 PM (IST)
Edited By: Murali Krishna

మద్యం తాగే వారంతా మహాపాపులు అంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో అన్నారు.

మందు తాగే వాళ్లు మహా పాపులు- అసలు భారతీయులే కాదు: సీఎం కామెంట్స్ వైరల్

NEXT PREV

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధంపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. అసలు మందు తాగేవాళ్లు భారతీయులే కాదని సీఎం అన్నారు. 







మద్యం తాగే వారంతా మహా పాపులు. అసలు భారతీయులే కాదు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని నేను భారతీయులుగా పరిగణించను. మద్యం సేవించడం హానికరం అని తెలిసినా కొందరు సేవిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదు.                                                             - నితీశ్ కుమార్, బిహార్ సీఎం


కఠిన చర్యలు


బిహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. అయితే దీన్ని కఠినతరం చేసేందుకు బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022కు సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్‌ చేసి బెయిల్‌ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. 


ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అమలు చేస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. అందుకు తగినట్లుగానే కఠిన చర్యలు చేపట్టారు. అయితే మద్యపాన నిషేధం వల్ల చాలా మంది కల్తీ సారాకు అలవాటైపోయి.. చనిపోతున్నారు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. కానీ నితీశ్ మాత్రం మద్యపాన నిషేధంపై మరింత కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.


Also Read: Rajya Sabha Election 2022: 13 రాజ్యసభ స్థానాల భర్తీకి పోలింగ్- సాయంత్రం 5 గంటలకు లెక్కింపు


Also Read: Sergey Lavrov India Visit: ఉక్రెయిన్ ఉద్రిక్తతల వేళ భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన 

Published at: 31 Mar 2022 03:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.