ఉక్రెయిన్ ఉద్రిక్తతల వేళ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ 2 రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు మొదలైన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అధికారక పర్యటన నిమిత్తం భారత్‌ రానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సెర్గీ గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకుంటారు.


ప్రధానంగా 


రెండు రోజుల అధికారక పర్యటన కోసం రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ దిల్లీ వస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సెర్గీ.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ కానున్నారు. ముడిచమురు కొనుగోలు, రూపాయి- రూబెల్ చెల్లింపు విధానంపై ఇరువురు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.


ముడిచమురు


భారత్‌, రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఈ వ్యాపారాన్ని 'రూపాయి-రూబెల్‌' చెల్లింపుల విధానంలో చేయడంపైనే లావ్రోవ్‌ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలానే వివిధ సైనిక హార్డ్‌వేర్‌లు, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థకు సంబంధించిన పరికరాలను నిర్దేశిత గడువులోగా అందజేయాలని భారత్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. 


కీలక సమయంలో


లావ్రోవ్‌ దిల్లీ పర్యటన సమయంలోనే అమెరికా డిప్యూటీ భద్రతా సలహాదారు, భారతీయ అమెరికన్‌ దలీప్‌ సింగ్‌ కూడా భారత పర్యటనకు రావడం విశేషం. అంతేకాదు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, జర్మనీ విదేశాంగ, భద్రతా విధాన సలహాదారు జెన్స్‌ ప్లాట్నర్‌ పర్యటనలు కూడా ఈ రెంజు రోజుల్లో ఉన్నాయి. 


శాంతి చర్చలు


మరోవైపు ఉక్రెయిన్​కు ఆర్థిక సాయాన్ని అందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఉక్రెయిన్‌కు 500 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. 55 నిమిషాల పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో బైడెన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.


రష్యా ఉక్రెయిన్‌ మధ్య చర్చల్లో పురోగతి సాధించేందుకు.. కీవ్‌ సహా ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు తగ్గించుకుంటామని చెప్పిన రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కీవ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా సేనలు బాంబు దాడి చేశాయని వారు పేర్కొన్నారు. 


Also Read: Customer Care : లగేజీ మార్చేసిన ఇండిగో - చుక్కలు చూపించిన కస్టమర్ ! మళ్లీ అలా చేయలేరంతే


Also Read: Heart Health: రోజూ మీరు చేసే ఈ పనులు గుండెను దెబ్బతీస్తాయి, వెంటనే మానేయండి