కస్టమర్ కేర్‌తో మనకు చాలా అనుభవాలు ఉంటాయి. ఏదైనా సర్వీస్ సరిగ్గా లేకపోతే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తాం..అనేక సార్లు అది..అది నొక్కేసిన తర్వాత.. అసలు సమస్యను పరిష్కరించరు కానీ.. ఏదేదో చెబుతారు. ఇలాంటి సమస్య మనందరికీ ఎదురయ్యే ఉంటుంది. అలాగే బెంగళూరుకు చెందిన నందన్‌కుమార్‌కు కూడా వచ్చింది.కానీ ఆయన అందరిలాగా సైలెంట్‌గా లేడు. సంస్థ అదిరిపోయేలా తన సమస్యను పరిష్కరించుకున్నాడు. ఆయన వ్యవహారించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలేం జరిగిందంటే...
నందన్ కుమార్ ఇండిగో ఎయిర్ లైన్ విమానంలో పట్నా నుంచి బెంగళూరు వచ్చాడు. ఆయన తన లగేజీ తీసుకుని ఇంటికొచ్చాడు. తీరా చూస్తే అది తన లగేజీ కాదు. ఎవరిదో. తన లగేజీ ఇంకెవరికో వెళ్లింది. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. ఐవీఆర్ఎస్ సిస్టిమ్‌లో అనేక నెంబర్లు నొక్కిన తర్వాత కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడారు. అవి మాటలకే పరిమితమయ్యాయి. కానీ సొల్యూషన్ మాత్రం దొరకలేదు. కనీసం తన లగేజీ ఇచ్చిన కస్టమర్ నెంబర్ ఇచ్చినా ఎక్సేంజ్ చేసుకుంటానని... సమస్యను పరిష్కరించుకుంటానన్నాడు. కానీ దానికీ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది అంగీకరించలేదు.
చూసి చూసి నందకుమార్ ఇక లాభం లేదని డిసైడయ్యాడు. ఇండిగో సైట్ నుంచి హ్యాక్ చేసేసి.. తన లగేజీని ఎవరికి ఇచ్చారో డాటా బయటకు తీశాడు. ఆ నెంబర్‌ను సంప్రదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే కాదు ఇండిగోకు సలహాలిచ్చాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇండిగో సంస్థ వెబ్ సైట్ హ్యాక్ చేసి ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం ఇంత ఈజీనా అని అందరూ అనుకోవడం ప్రారంభించారు. మొత్తంగా ఇదేదో తేడాగా ఉందని ఇండిగో కూడా స్పందించింది. తమ సైబర్ సెక్యూరిటీ చాలాగొప్పదని.. నందన్ కుమార్ సమస్యనుచాలా వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పుకున్నారు.
ఈ వ్యవహారంలో ఇండిగో ఎయిర్ లైన్స్ పరువు ఆన్ లైన్ పాలయిందనినెటిజన్లు జోకులేసుకుంటున్నారు.