తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్న తమిళ స్టార్ హీరో సూర్య. ఆయన సినిమాలకు ఓటీటీలోనూ ఆదరణ బావుంది. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' చిత్రాలు డైరెక్టుగా ఓటీటీ వేదికల్లో విడుదల అయ్యాయి. ఆ రెండు చిత్రాలూ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ రెండిటి తర్వాత సూర్య నటించిన సినిమా 'ఈటి - ఎవరికీ తలవంచడు'. మార్చి 10న థియేటర్లలో విడుదలైంది. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.


'ఈటి - ఎవరికీ తలవంచడు' సినిమా డిజిటల్ రైట్స్ రెండు ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. సన్ నెక్స్ట్ (Sun NXT), నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికల్లో ఏప్రిల్ 7 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'ఈటి' ఓటీటీ రిలీజ్ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే... సన్ నెక్స్ట్ ఏమీ చెప్పలేదు. కాకపోతే ఏప్రిల్ 7 నుంచి ఆ ఓటీటీలో కూడా సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Also Read: సూర్య 'ఈటి - ఎవరికీ తలవంచడు' రివ్యూ : తమిళ ప్రేక్షకుల కోసమేనా? తెలుగు గురించి ఆలోచించరా?


సూర్య సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభించిందనేది పక్కన పెడితే... తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువ అయ్యిందనే విమర్శలు వచ్చాయి. ఓటీటీలో ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి. 


Also Read: అది పునర్నవి కావాలని చేసిందా? పొరపాటు జరిగిందా?