Maharashtra Political News: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందేపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయన కుమారుడు శ్రీకాంత్ శిందే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొన్న ఓ ఫోటో వైరల్ కావడం రాజకీయ దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్‌సీపీ శిందే సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
ఇదీ సంగతి
ఈ ఫొటోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఏక్‌నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ అధికారులు ఉండగా.. ఆయనేవో దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు అందులో ఉంది.
సీఎంగా
భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు ఏక్‌నాథ్ శిందే. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనూహ్యంగా శిందేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడణవీస్ ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా శిందేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని అసలు ఊహించలేదు.
తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడణవీస్ ప్రకటించగా.. భాజపా హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడణవీస్.. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
Also Read: Yediyurappa Graft Case: మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ రిలీఫ్- ఆ కేసు విచారణపై సుప్రీం స్టే!
Also Read: Kerala HC On PFI: 'అనుమతి లేకుండా బంద్ ఎలా చేస్తారు?' PFIపై కేరళ హైకోర్టు సీరియస్