MP Massive Fire In Hospital: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్‌పుర్‌లోని న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది వరకు మృతి చెందారు. 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇదే కారణం
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రి సిబ్బందేనని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో రోగులను ఇతర హాస్పిటల్స్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇది చాలా పెద్ద అగ్నిప్రమాదం. సమాచారం అందిన వెంటనే మా బృందాలు అక్కడికి చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నాం. - అఖిలేశ్ గౌర్, జబల్‌పుర్ సీఎస్‌పీ
పరిహారం
ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
జబల్‌పుర్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. - శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం
Also Read: Viral News: 'మీరు పెన్సిల్ రేటు పెంచడం వల్ల మా అమ్మ కొట్టింది'- ప్రధాని మోదీకి చిన్నారి లేఖ