Lok Sabha Election 2024 Date LIVE: దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికల్లో - ముఖ్యమైన తేదీలివే
Lok Sabha Election 2024 Date LIVE Updates: కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఏడో దశ: నోటిఫికేషన్ - మే 7, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 14, నామినేషన్ల పరిశీలన - మే 15, ఉపసంహరణకు ఆఖరు తేదీ - మే 17, పోలింగ్ తేదీ - జూన్ 1.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఆరోదశ: నోటిఫికేషన్ - ఏప్రిల్ 29, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 6, నామినేషన్ల పరిశీలన - మే 7, ఉపసంహరణకు ఆఖరు తేదీ - మే 9, పోలింగ్ తేదీ - మే 25.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఐదోదశ: నోటిఫికేషన్ - ఏప్రిల్ 26, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మే 3, నామినేషన్ల పరిశీలన - మే 4, ఉపసంహరణకు ఆఖరు తేదీ - మే 6, పోలింగ్ తేదీ - మే 20.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ నాలుగోదశ: నోటిఫికేషన్ - ఏప్రిల్ 18, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26, ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 29, పోలింగ్ తేదీ - మే 13.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ మూడోదశ: నోటిఫికేషన్ - ఏప్రిల్ 12, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 19, నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 20, ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 22, పోలింగ్ తేదీ - మే 7.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ రెండోదశ: నోటిఫికేషన్ - మార్చి 28, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 4, నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 5, ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 8, పోలింగ్ తేదీ - ఏప్రిల్ 26.
లోక్ సభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా ఏపీలో 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
లోక్ సభ తొలిదశ: నోటిఫికేషన్ - మార్చి 20, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - మార్చి 27, నామినేషన్ల పరిశీలన - మార్చి 28, ఉపసంహరణకు ఆఖరు తేదీ - మార్చి 30, పోలింగ్ తేదీ - ఏప్రిల్ 19
దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 'ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు, 26 రెండో దశ, రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్, మూడో దశలో మే 7న, మే 13న నాల్గో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది.' అని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 'ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26, ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 29, పోలింగ్ తేదీ - మే 13, ఓట్ల లెక్కింపు - జూన్ 4.' ఉంటుందని వివరించారు.
వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 'బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేశాం. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమిస్తాం. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను వాడుతాం. ఎవరైనా హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాం. రెండోసారి ఓటు వేయడానికి కేసు బుక్ చేస్తాం.' అని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ ప్లీనరీ హాల్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 'దేశంలో 48 వేల ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసేలా అవకాశం కల్పిస్తున్నాం. ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది. దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి.' అని పేర్కొన్నారు.
జూన్ 16తో ప్రస్తుత 17వ లోక్ సభ గడువు ముగియనుంది. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో 10.5 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. 'కోటీ 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. 49.7 కోట్ల పురుష ఓటర్లు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశాం.' అని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. లోక్ సభ ఎన్నికలు సహా ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేయనున్నారు. దీనిపై సీఈసీ మీడియా సమావేశం కొనసాగుతోంది.
ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానున్న టైంలో ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించింది. 3.64 చొప్పున రెండు డీఏలు ఇచ్చింది. ఒకటి ఏప్రిల్ జీతంలో రానుంది. రెండోది జూలై శాలరీలో రానుంది. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ ఏప్రిల్‌లో ఇస్తారు. గతేడాది జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జులై ఇస్తారు.
ఇవాళ సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి జూన్‌తో ముగియనుంది.
Lok Sabha Election 2024 Date LIVE: 2024 సాధారణ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. మధ్యాహ్నం 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలతోపాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికల తేదీలు కూడా ప్రకటించనున్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేడు షెడ్యూల్ ప్రకటించనున్నారు. షెడ్యూల్ విడుదలైన తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా అధికార పార్టీ కార్యక్రమాలు ఎక్కడకక్కడ నిలిపివేయాల్సి ఉంటుంది. నేటి మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. ఎన్నికల కోడ్ ప్రకారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదు.
గత ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 10న పోల్ షెడ్యూల్ వెల్లడించారు. అయిదేళ్ల కిందట ఏప్రిల్, మే నెలలో దశలవారీగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించడం తెలిసిందే.
శనివారం సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. మే నెలలోగా లోక్‌సభతోపాటు కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. నామినేషన్ల తేదీలతో పాటు ఎన్నికల తేదీ, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలను నేడు ఈసీ వెల్లడించనుంది.
Background
Lok Sabha Polls Schedule Telugu News: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) మార్చి 15న కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం (మార్చి 16న) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ట్వీట్ చేసింది. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)తో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను ఇటీవల నియమించగా.. మార్చి 15న ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో వీరు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈసీ వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఇటీవల అరుణ్ గోయల్, (Arun Goel) గతేడాది అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది.
అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురి పేర్ల పరిశీలన అనంతరం వీరిని ఎంపిక చేయగా.. వెను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.
ఎన్నికల సంఘం ఏర్పాట్లు
ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం కూడా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
మరి కొద్ది రోజుల్లోనే షెడ్యూల్ విడుదలవుతుందనగా ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. అంత కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే...ఉన్నట్టుండి ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమేంటన్న చర్చ తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. కొంత మంది ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే రాజీనామా చేశారని చెప్పారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -