DHOP Song Promo From Game Changer: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి ‘దోప్’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 


Also Readపవన్ కళ్యాణ్ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి... బ్యాంకాక్‌లో షూటింగ్ - 'ఓజీ'లో రాధిక రోల్ ఏమిటంటే?


సంక్రాంతి బరిలో...
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే. జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకూ మహరాజ్’ విడుదల కానుంది. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే జనవరి 14వ తేదీన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.


సందీప్ కిషన్ ‘మజాకా’ కూడా సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అయితే పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. వీటితో అజిత్ నటిస్తున్న డబ్బింగ్ సినిమా ‘విడాముయర్చి’ కూడా విడుదల కానుంది. ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. 


టీజర్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నాడని టీజర్‌ను బట్టి చెప్పవచ్చు. పీరియాడిక్ టైమ్‌లో ఒక రోల్, ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఒక రోల్ ఉండనుంది. తండ్రీ కొడుకుల పాత్రలను పోషించినట్లు రామ్ చరణ్ బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేలో తెలిపారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఇప్పటికే విడుదల అయిన ‘జరగండి’, ‘నానా హైరానా’, ‘రా మచా మచా’ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.


Also Read: Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ