పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'ఓజీ' (OG Movie) ఒకటి. ఆయన వీరాభిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నేహ శెట్టి (Neha Shetty) కూడా ఉన్నారు. ఆవిడ ఏం చేస్తున్నారో తెలుసా? ఆవిడ రోల్ ఏమిటో తెలుసా?
'ఓజీ' సినిమాలో నేహా స్పెషల్ సాంగ్
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధికారికంగా పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. అయితే... ఆల్రెడీ 'ఎస్' చెప్పిన, సెట్స్ మీదకు తీసుకు వెళ్లిన సినిమా షూటింగులకు మధ్య మధ్యలో హాజరు అవుతున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను దర్శకులు ముందుగా పూర్తి చేస్తున్నారు. 'ఓజీ' (They Call Him OG) సినిమా షూటింగ్ కూడా అలాగే జరుగుతుంది.
బ్యాంకాక్ లో కొన్ని రోజులగా 'ఓజీ' చిత్రీకరణ జరుగుతుంది. సినిమా కెమెరా వర్క్ చూస్తున్న రవి కె చంద్రన్ మధ్యలో రెగ్యులర్ షూట్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మధ్య 'ఓజీ'లో వియత్నం, జపాన్ దేశాలకు చెందిన ఆర్టిస్టులు నటిస్తున్నారని ఆయన చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో నేహా శెట్టి కూడా ఉన్నారు.
'ఓజీ' సినిమాను డీవీవీ మూవీస్ పతాకం మీద డీవీవీ దానయ్య, ఆయన తనయుడు కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్, ప్రియాంక మీద కొన్నాళ్ల క్రితం పుణెలో ఒక పాట తీశారు. మరి నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌కు తమన్ ఎటువంటి ట్యూన్ ఇచ్చారో చూడాలి.
Also Read: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు
తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో నేహా శెట్టి ఓ పోస్ట్ చేశారు. 'లెట్స్ రోల్' అంటూ మేకప్ రూమ్ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు బ్యాంకాక్ అని పేర్కొన్నారు. దాంతో నేహాను ఫాలో అయ్యే అభిమానులకు, ప్రేక్షకులకు చిన్న డౌట్ వచ్చింది అక్కడ ఏ షూటింగ్స్ చేస్తున్నారు? అని! ఆరా తీస్తే కలిసిన విషయం ఏమిటంటే... 'ఓజీ' సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అది సంగతి!
Also Read: సౌత్ కంటే డబుల్... హిందీలో మొదటి సినిమా 'బేబీ జాన్' కోసం రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
'ఓజీ' కంటే ముందు 'హరిహర వీరమల్లు'
సుజిత్ ఓజీ సినిమా కంటే ముందు హిస్టారికల్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' థియేటర్లలోకి రానుంది. వచ్చే ఏడాది మార్చి 28న ఆ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేపట్టారు. కొన్ని రోజులగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'ఓజీ' విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలోని 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.