మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాస్ హీరో. ఆయన సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండాలని అభిమానులు ఆశిస్తారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా మెసేజ్ ఉంటే మంచిదని దర్శక నిర్మాతలు - రచయితలు ఆ దిశగా సన్నివేశాల రూపొందిస్తారు. అయితే...‌‌ వీటన్నిటికీ మించి చిరులో మాంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆ కామెడీని ఎవరు సరిగా వాడుకోలేదు. అందుకే ఆ తరహా సినిమా చేయాలని చిరు డిసైడ్ అయ్యారని ఫిలిం నగర్ టాక్. 


అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు వినోదం!
చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించినప్పటికీ... తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ చేంజర్' కోసం సంక్రాంతి సీజన్ త్యాగం చేశారు చిరు. దాంతో 'విశ్వంభర' మే 9న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల నుంచి వినబడుతోంది. అది పక్కన పెడితే... 'విశ్వంభర' విడుదల కంటే ముందు మరో రెండు సినిమాలను లైనులో పెట్టారు.


సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్‌లో 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. అతనితో ఓ సినిమా చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.‌ ఆ సినిమా కంటే ముందు మరొక సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళనున్నారు.


వినోదంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఆయన తీసిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' భారీ విజయాలు సాధించాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' గాని, మాస్ మహారాజా రవితేజ హీరోగా తీసిన 'రాజా ది గ్రేట్' సినిమా గానీ ప్రేక్షకులను నవ్వించాయి.‌ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చిరంజీవి రెడీ అయ్యారు.


Also Read: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు


చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమాను షైన్ స్క్రీన్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయనున్నారని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మొదలు కావచ్చు అని అనిల్ రావిపూడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలో సినిమా గురించి అనౌన్స్మెంట్ రానుంది. 'విశ్వంభర' విడుదల కంటే ముందు సినిమా మొదలు కావచ్చు. 'దసరా' తర్వాత నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల మరో సినిమా 'ప్యారడైజ్' స్టార్ట్ చేశారు. ఆ సినిమా పూర్తి కావడానికి టైం పడుతుంది కనుక ఈ మధ్యలో అనిల్ రావు పూడి సినిమా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట మెగాస్టార్.


Also Readసౌత్ కంటే డబుల్... హిందీలో మొదటి సినిమా 'బేబీ జాన్' కోసం రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్