రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి ఒక హారర్ ఫాంటసీ ఫిలిం చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) ఫస్ట్ లుక్ గానీ, సినిమా గానీ ముందు నుంచి ప్రేక్షకులను ఒక విధమైన ఆసక్తి కలిగించింది. ఆ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? అని ఎదురు చూసే ఆడియన్స్ ఉన్నారు. వాళ్లందరికీ ఒక బ్యాడ్ న్యూస్.


వాయిదా పడిన 'ది రాజా సాబ్' విడుదల!?
The Raja Saab Release Date Postponed: 'ది రాజా సాబ్'ను తొలుత ఏప్రిల్ 10 2025ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం సందేహమే అనే మాటలు వినపడుతున్నాయి. అందుకు కారణం ప్రభాస్ హెల్త్ కండిషన్!


'ఫౌజీ' చిత్రీకరణలో గాయం... విశ్రాంతి తప్పనిసరి!
ప్రేమ కథలకు సరికొత్త నేపథ్యం జోడించి ప్రేక్షకులను మరొక ఊహ ప్రపంచంలోకి తీసుకు వెళ్తున్న దర్శకుడు హను రాఘవపూడి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తీసిన 'సీతా రామం' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఆ సక్సెస్ ఆయనకు ప్రభాస్ హీరోగా సినిమా చేసే అవకాశాన్ని తెచ్చింది. 


ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి పాన్ ఇండియా ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానికి 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేశారు. ఆఫ్ కోర్స్ ఇంకా ఆ టైటిల్ అనౌన్స్ చేయలేదనుకోండి. అయితే ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 'ఫౌజీ' షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ గాయపడ్డారు. ఆయన ఇంజ్యూరీ 'ది రాజా సాబ్' మీద ఇంపాక్ట్ చూపిస్తుందని టాక్. 


ఇంజ్యూరీ కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోక తప్పదు అని ప్రభాస్ (Prabhas)కు వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో ఆయన ఇంటి నుంచి సెట్స్ కు వచ్చి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ప్రభాస్ గాయం పడటం వల్ల 'ది రాజా సాబ్' లేటెస్ట్ షెడ్యూల్ కాస్త ఆలస్యం అవుతుందని, అందువల్ల ఏప్రిల్ 10న విడుదల అయ్యే అవకాశాలు లేవని ఫిలింనగర్ వర్గాలలో వినబడుతోంది.


ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ పోస్ట్ పోన్ కావడం వల్ల స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్'ను ఏప్రిల్ 10న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని టాక్. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈ రోజే చేశారు. ప్రభాస్ రావడం లేదు కనుక 'జాక్'తో పాటు ఆ తేదీ మీద మరిన్ని సినిమాలు కన్నేసే అవకాశం ఉంది.


Also Readపవన్ కళ్యాణ్ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి... బ్యాంకాక్‌లో షూటింగ్ - 'ఓజీ'లో రాధిక రోల్ ఏమిటంటే?


పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్నన్ని సినిమాలు ఇతర హీరోల చేతులలో లేవని చెబితే అతిశయోక్తి కాదు. షూటింగులో రెండు, షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు రెండు, ‌ ఆ తరువాత సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నవి రెండు... అరడజనుకు పైగా సినిమాలను లైనులో పెట్టారు ప్రభాస్. ఇక్కడ ఓ సినిమా చిత్రీకరణలో అయినా గాయం మరొక సినిమా విడుదల మీద ప్రభావం చూపడం అనేది మొదటిసారి ఎదురైంది. 'ది రాజా సాబ్', 'ఫౌజీ' కాకుండా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ', ప్రశాంత్ నీల్ 'సలార్ 2'తో పాటు హోంబాలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయనున్న మరో రెండు సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.


Also Readఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు