దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ తరహా నిబంధనలు విధించారు. ఈ సారి కరోనా కారణం కాదు. కాలుష్యం కారణం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ ద్వాారా పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 17 వ తేదీ భవన నిర్మాణ కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ చర్యల వల్ల వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం తగ్గే అవకాశం ఉండటంతో ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Also Read : అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి
ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీ కాలుష్యమయం అయిపోతుంది. ఈ సారి కూడా అదే పరిస్థితి. కొద్ది రోజులుగా పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లను దాటిపోయింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమయింది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని చీఫ్ జస్టిస్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read: Breaking News: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా దిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రైతులు పొలాల్లో పంటలను తగులబెట్టకుండా చూస్తామని కేంద్రం చెప్పింది.అయితే అయితే రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని చెప్పలేమని.. అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చెప్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించారు.
Also Read : నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు వెలువడిన గంటల్లోనే సీఎం కేజ్రీవాల్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 నుంచి 200 కు తగ్గేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Also Read : ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి