Breaking News: దిల్లీలో మళ్లీ ప్రభుత్వ సిబ్బందికి వర్క్‌ఫ్రమ్‌ హోం .. సుప్రీం ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 13 Nov 2021 06:26 PM

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై ఉంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు...More

మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడని టీఆర్ఎస్ నేతపై కేసు

సిరిసిల్ల జిల్లా యువజన టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు మనోజ్‌పై కేసు నమోదైంది. మహిళా ఎస్సైపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని సీఐ అనిల్‌ వెల్లడించారు. సిరిసిల్లలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ పడగా.. ఆపేందుకు వెళ్లిన మహిళా ఎస్సై పట్ల మనోజ్‌ అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రధానిపై రసమయి బాలకిషన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నిరసనకు దిగింది. గాంధీ చౌక్‌ వద్ద రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి.