'ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఓ తుపాన్' - పవన్ కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు
'ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఆయన పవన్ కాదు ఓ తుపాన్'.. ఇవీ మోదీ (Modi) ఎన్డీయే 3.0 సమావేశంలో పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కురిపించిన ప్రశంసలు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యక్తి ఓ తుపాన్ అంటూ కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీకి మొదటి షాక్ - పార్టీకి రావెల కిషోర్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిలో ఉన్న ఆయన ఆ తర్వాత రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తన భార్యను కూడా ఆయన పార్టీలో చేర్చారు. బాపట్ల ఎంపీ టిక్కెట్ ఆయనకు లేదా ఆయన భార్యకు ఇస్తారని అనుకున్నారు. కానీ టిక్కెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మోదీ సలహాతోనే ఎన్డీయే అఖండ విజయం - ఎన్డీయే 3.0 సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్
మోదీ సలహాతోనే ఏపీలో ఎన్డీయే అఖండ విజయం సాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఢిల్లీలోని ఎన్డీయే 3.0 కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ నాయకత్వానికి జనసేన మద్దతిస్తుందని స్పష్టం చేశారు. 'జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ భారతదేశానికి ప్రధానిగా ఉన్నంత వరకూ ఏ దేశానికీ తలొగ్గే పరిస్థితి రాదు. మోదీ నేతృత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం.' అని పవన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ - క్షణక్షణ ఉత్కంఠ, విజేత ఎవరో?
తెలంగాణలో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నికల ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో నిలిచారు. అటు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి తీన్మార్ మల్లన్న.. రాకేశ్ రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ట్రాన్స్‌ఫర్స్ ఫైల్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు (Govt Teachers) గుడ్ న్యూస్ చెప్పనుంది. చాలా కాలంగా ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముందడుగు పడినట్లు తెలుస్తోంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ఫైల్‌ను విద్యా శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆమోదం కోసం పంపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి