Modi Hails Pawan Kalyan In NDA 3.0 Meeting: 'ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఆయన పవన్ కాదు ఓ తుపాన్'.. ఇవీ మోదీ (Modi) ఎన్డీయే 3.0 సమావేశంలో పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కురిపించిన ప్రశంసలు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యక్తి ఓ తుపాన్ అంటూ కొనియాడారు. ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి భారీ విజయం సాధించడం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమన్నారు.
Also Read: Chandrababu: 'మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నెం.1' - మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు