PM Modi As NDA Leader: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న NDA కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో NDA ఎంపీలు, కీలక నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌ మోదీని NDA పక్షనేతగా ప్రతిపాదించగా ఎంపీలు ఆమోదించారు. మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం చాలా గొప్ప విషయం అని రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. 






అమిత్‌ షా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మూడోసారి NDA నేతగా మోదీ బాధ్యతలు చేపట్టడం చరిత్రాత్మకం అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు అభినందనలు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌ ప్రతిపాదనకు తాను పూర్తిగా మద్దతునిస్తున్నట్టు స్పష్టం చేశారు. 







రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదనను ఆయన బలపరిచారు. అమిత్‌షా తో పాటు నితిన్ గడ్కరీ కూడా తన ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలోనే NDA ఎంపీలంతా కలిసి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకునేలా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ తరవాత రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.