Satyabhama Today Episode క్రిష్‌ ఫుల్లుగా తాగేస్తాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ క్రిష్‌ తాగేసిన మైకంలో పడుకుండిపోతాడు. రాజా రాజా అని సత్య ఎంత పిలిచినా లేవడు. సత్య తిట్టుకుంటుంది. తల పట్టుకొని కూర్చొంటుంది. క్రిష్ సత్యని చాటుగా చూసి ఫుల్లు బాటిల్ తాగితేనే తానని ఎవరూ ఏం చేయలేరు అని ఒక్క పెగ్గు తాగించి తనతో నిజం చెప్పించుకోవాలి అని చూస్తే ఇలాగే ఉంటుందని అనుకుంటాడు. కావాలనే గురక పెట్టినట్లు సౌండ్ చేస్తాడు. 


సంధ్య ఇంకా ఇంటికి రాలేదు అని విశాలాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. హర్ష వచ్చి అడిగితే సంధ్య ఇంకా రాలేదు అని చెప్తుంది. వస్తుందని టెన్షన్ పడొద్దని అంటాడు. విశ్వనాథం కూడా అక్కడికి వస్తాడు. ఇంతలో సంధ్య పరుగున వచ్చి కూలబడి ఏడుస్తుంది. అందరూ కంగారు పడతారు. విశాలాక్షి కూడా ఏడుస్తుంది. హర్ష సంధ్యని తీసుకెళ్లి కూర్చొపెట్టి విషయం అడుగుతాడు.  


సంధ్య: నాన్న నన్ను కాళీకి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా.. చెప్పు నాన్న..
విశాలాక్షి: నిన్ను ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అమ్మా. ఏం మాట్లాడుతున్నావ్.
హర్ష: ఎవరు అన్నారు నిన్ను అలా.
సంధ్య: కాళీ.
విశ్వనాథం: వాడు నిన్ను ఎక్కడ కలిశాడమ్మా. సంధ్య జరిగింది అంతా చెప్తుంది. పరుగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తుంది.
విశాలాక్షి: ఏంటండి.. ఏంటి ఇదంతా.
విశ్వనాథం: వాడికి చావు మూడింది అందుకే నా కూతురి జోలికి వచ్చాడు. 
విశాలాక్షి: సంధ్యని వాడికిచ్చి పెళ్లి చేయడం ఏంటి ఎందుకు అలా వాగుతున్నాడు.
హర్ష: నిజంగా మీరు మాట ఇచ్చారా నాన్న.
విశ్వనాథం: రేయ్.. నేను అలా ఎలా ఇస్తానురా. ఆ పరిస్థితే వస్తే సంధ్యని బావిలో తోసి చంపేస్తా తప్ప వాడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తా.
హర్ష: వాడికి చావు మూడింది అమ్మ అందుకే మన జోలికి వస్తున్నాడు.
విశ్వనాథం: అవసరం అయితే వాడిని చంపి నేను జైలుకి వెళ్తాను. నువ్వు ఇందులో దూరకు హర్ష. వెళ్లు. నేను ఉన్నాను అమ్మా నీకు మళ్లీ ఆ కాళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా.


రేణుక, సత్య కిచెన్‌లో ఉంటారు. ఇంతలో రేణుకకి కళ్లు తిరిగి పడిపోబోతే సత్య పట్టుకుంటుంది. నీరు ఇస్తుంది. ఇక గదిలోకి తీసుకెళ్తుంది. ఏమైందని రేణుకని అడుగుతుంది. నీరసంగా ఉందని రేణుక కవర్ చేస్తుంది. ఫీవర్ వచ్చిందేమో అని ట్యాబ్లెట్స్ ఇవ్వబోయిన సత్య డ్రాలో మామిడికాయలు చూస్తుంది. మామిడి కాయ తీసి రేణుకకి ఇస్తుంది. రేణుక షాక్ అయిపోతుంది. అక్కడి నుంచి రేణుక వెళ్లిపోతుంటే ఆపుతుంది.


సత్య: ఎన్నో నెల అక్క. గొప్పగా చెప్పుకోవాల్సిన శుభవార్తని ఎందుకు దాచుకుంటున్నావ్. పాపం మామయ్య వారసుడి కోసం ఎంతో ఆరాట పడుతున్నారో తెలుసా. ఈ శుభవార్త వింటే పండగ చేసుకుంటారు. పొంగిపోతారు. 
రేణుక: కానీ ఓ మనిషి మాత్రం నా కడుపులో బిడ్డను చిదిమేస్తాడు. ఆయన ఎవరో కాదు నా భర్త. 
సత్య: మారుంటారేమో..
రేణుక: ఆయన మారుంటే నాకు ఇలా దొంగతనంగా దాచుకోవాల్సిన అవసరం ఏముంటుంది సత్య. ఈ శుభవార్తని అందరికీ చెప్పుకొని సంతోషపడాలి అని నాకు ఉండగా. ఇంతకు ముందు రెండు సార్లు నా కడుపులో బిడ్డను కడుపులోనే చంపేశాడు. ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు అందుకే ఈసారి దాచేశా. నా బిడ్డను కాపాడుకుంటున్నా.
సత్య: ఆవేశంతో నేను రచ్చ చేస్తాను అని దాచేశావ్ కదా అక్క. అన్యాయం జరుగుతుందని ఎదురిస్తా కానీ దానివల్ల నీకు నష్టం జరుగుతుందంటే దాయనా. ఏదో ఒక రోజు ఈ నిజం బయట పడుతుంది కదా. ఎన్నాళ్లు దాస్తావ్. 
రేణుక: కనీసం నాలుగు నెలలు. తర్వాత నా భర్త కూడా నా బిడ్డ జోలికి పోలేడు. డాక్టర్లు కూడా ఒప్పుకోరు కదా. నువ్వు కూడా నా కడుపులో బిడ్డ గురించి ఎవరికీ చెప్పకు సత్య.
సత్య: నాలోనే దాచుకుంటాను.


సత్య తాను ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో క్రిష్ సత్యని చూసి పారిపోబోతాడు. ఎందుకు అని ఆపి సత్య అడుగుతుంది. ఇక క్రిష్ ఇంకా కొద్ది సేపు ఇక్కడే ఉంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అని అడుగుతావని అంటుంది. ఇక సత్యతో తాగించి నిజం చెప్పించాలి అని అనుకున్నావ్ కదా అని అంటాడు. ఇక క్రిష్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తా అంటాడు. ఇందుకు క్యారెక్టర్లు మార్చుతాడు. సత్య చిరాకు పడుతూనే ఒప్పుకుంటుంది. 


క్రిష్ మందు కొంచెం తాగుతాడు. దూరంగా ఉన్న తమ బెడ్‌లు దగ్గరకు జరుపుతాడు. ఆ రోజు సత్య తాగి తూలుతున్నట్లు నటిస్తాడు. టవల్ కప్పుకొని సత్య ఆ రోజు మాట్లాడిన మాటలు రిపీట్ చేస్తాడు. అలా సత్య తనని బెడ్ మీదకు తోసేసినట్లు సత్యని తోసేస్తాడు. సత్య పడుకోగానే క్రిష్ కూడా ఆరోజు సత్య తన దగ్గరకు వచ్చి పడుకొని ముద్దు పెట్టుకుందని చెప్తూ సత్యని ముద్దు పెట్టుకుంటాడు. సత్య షాక్ అయి తాను అలా చేయను అని వాదిస్తుంది. ముద్దు దగ్గరే ఆపేశావ్ అని తర్వాత ఇంకా చాలా చేశావ్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మురారిని కనిపెట్టేసిన కృష్ణ.. డాక్టర్‌ని నిలదీసి సరోగసీ గురించి తెలసుకున్న భవాని, కృష్ణ తల్లి కాబోతుందా!