Trinayani Today Episode వల్లభ తన తల్లి తిలోత్తమ దగ్గరకు వెళ్తాడు. ఇక వల్లభ తిలోత్తమతో మమ్మీ ఆస్తి హాసిని పేరు మీద ఉంది. మనకు ఏమీ లేదు. నువ్వు మాత్రం పెద్ద కారుల్లో వచ్చావ్ అంటే బిల్డప్ ఇవ్వడానికి రెంట్ కార్లలో వచ్చావా అని అడుగుతాడు. తిలోత్తమ వల్లభను తిట్టి ఎవరి కోసం చూపించాలి బడాయి అంటుంది. 


తిలోత్తమ: హాసినికి 50 కోట్లు ఉండొచ్చు. నయనికి 100 కోట్లు దాటి ఉండొచ్చు. నా దగ్గర ఎంత ఉందో తెలుసా.
వల్లభ: ఎంత..
తిలోత్తమ: జస్ట్ 300 కోట్లే. 
వల్లభ: మూడు వందల కోట్లు ఉన్నాయా. అంత డబ్బు ఎక్కడ మమ్మీ. బ్యాంక్ దోచుకున్నట్లు కూడా పేపర్‌లో రాలేదు.
తిలోత్తమ: వల్లభ నేను దొంగతనం చేయలేదు. అమావాస్యకు మూడు రోజుల ముందు జరగకూడనిది జరిగేలా చేసింది.
వల్లభ: ఎవరు చేసింది. ఏం చేసింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. 


తిలోత్తమ పెద్దగా నవ్వుతూ నిను వీడని నీడను నేనే అని పాట పాడుతుంది. ఇక వల్లభ చేతికి గ్లౌజ్ ఉంది ఏంటి మమ్మీ అని అడిగితే తాకకూడదు అని తిలోత్తమ అంటుంది. ఎందుకు అని వల్లభ అంటే చెప్పా కదా జరగకూడనిది జరిగింది అని అంటుంది. వల్లభ షాక్ అయిపోతాడు.


సుమన ఉలూచిని ఆడిస్తూ ఉంటుంది. విక్రాంత్ ఆలోచిస్తూ ఉంటాడు. తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడ లేదని విక్రాంత్‌ని అడుగుతుంది. విక్రాంత్ తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన తల్లి అంత లగ్జరీగా ఎలా అయ్యిందని అనుమానిస్తాడు. తన తల్లి వెనక ఎవరో ఉన్నారు అని ఏదో చేశారు అని అంటాడు. సుమన మాత్రం తన అత్తయ్యను నమ్ముతున్నాను అని అంటుంది. తిలోత్తమ తన స్వార్థం కోసం భర్తనే చనిపోయాడు అని చెప్పి ఇంట్లో చేరిందని అలాంటిది కోడళ్లు.. కొడుకులు ఆమెకు ఓ లెక్క కాదు అని అంటాడు.


అందరి కోసం దురంధర, హాసినిలు భోజనం ఏర్పాటు చేస్తారు. తిలోత్తమ రాక కోసం అందరూ చూస్తారు. గదిలోకి వెళ్లిన అప్పటి నుంచి కిందకే రాలేదు అని అనుకుంటారు. ఇక తాము వడ్డిస్తాం అని తోటికోడళ్లు అంటారు. తిలోత్తమ అసిస్టెంట్‌లను పంపేస్తారు. ఇద్దరు సర్వెంట్లకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇస్తున్నాను అని వాళ్లతో పని చేయించుకోవాలి తిలోత్తమ అంటుంది. ఇక సుమన షాక్ అయితే ఆ డబ్బు తనకు కొత్తిమీర కట్టతో సమానం అంటుంది. హాసిని బాగా బలిసినట్లు ఉందని సెటైర్లు వేస్తుంది. తిలోత్తమ ఎడమ చేతిలో స్పూన్ పట్టుకొని తింటే అందరూ వింతగా చూస్తారు. ఎడమ చేతితో ఎందుకు తింటున్నావ్ అని అడుగుతారు. విశాల్ తిలోత్తమ కుడి చేతికి ఉన్న గ్లౌజ్ తీసి తినమంటాడు. తిలోత్తమ వద్దు అనేస్తుంది. 


చేతి గ్లౌజ్ గురించి అడుగుతాడు విశాల్. తిలోత్తమ దెబ్బ తగిలిందని తిలోత్తమ అంటుంది. నయని హడావుడిగా ఏమైందో అని వెళ్తే అసిస్టెంట్లు దూరంగా ఉండమని అంటారు. ఇక ఆ చేతి గురించి తెలుసుకోవాలి అని హాసిని చేయి పట్టుకుంటుంది. దీంతో తిలోత్తమ చేయి వణికిపోతూ గట్టిగా అరుస్తుంది. టచ్ చేసింది టచ్ చేసింది అని హడావుడి చేస్తుంది. తర్వాత అసిస్టెంట్లకు నిమ్మకాయలు అడిగి వాటిని చేతి మీద పిండి మంత్రం చెప్తుంది. దాంతో చేయి వణకడం నొప్పి తగ్గుతాయి. ఇంట్లో అందరూ కంగారు పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: వైశాలిని నాగలోకం పంపేయమన్న నాగసాధువు.. వైశాలికి సంపూర్ణ నాగ లక్షణాలు ఇస్తానన్న నాగదేవత!