Krishna Mukunda Murari Today Episode మురారి ముకుంద నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ముకుంద మురారి దగ్గరకు వస్తుంది. తాను సంతోషంగా ఉన్నాను అని ముకుంద అంటుంది. ఇప్పటి వరకు మీ అమ్మ, పెద్దమ్మతో పాటు కృష్ణ కూడా తాను మురారి వల్లే తల్లి కాబోతున్నాను అని నమ్మేసిందని అంటుంది. మురారి అది జరగదు అని అంటాడు. కృష్ణలో ఇంత మార్పు ఊహించలేదు అని కృష్ణ తనతో మాట్లాడిన మాటలు ఇకపై తనే ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పింది అని కూడా ముకుంద మురారితో చెప్తుంది.



 మురారి: కృష్ణ నిన్ను నమ్మడం జరగదు. నన్ను అనుమానించడం జరగదు.
ముకుంద: జరిగింది. కావాలి అంటే రేపు తను ఐ హేట్‌ యూ ఏసీపీ సార్ అనే వాయిస్ కూడా రికార్డ్ చేసుకొని తీసుకొని వస్తా. 
మురారి: ఆపు ముకుంద. అయినా నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్తున్నా ఎందుకు నన్ను పట్టుకొని పీడిస్తున్నావ్.
ముకుంద: ఎందుకు అంటే ఎప్పటికైనా నీ మనసు మారుతుంది అని.
మురారి: అది ఎప్పటికీ జరగదు. 


ఇంతలో కృష్ణ, మధులు ముకుందని ఫాలో అయిన మురారి ఉన్న ప్లేస్‌కి వస్తారు. మురారి పరిస్థితి చూసి షాక్ అయిపోతారు. ముకుంద కూడా కృష్ణ వాళ్లని చూసి హడలెత్తిపోతుంది. మురారి హ్యాపీగా ఫీలవుతాడు. కృష్ణ ఏసీపీ సార్ అనుకుంటూ వెళ్లి మురారి పరిస్థితికి ఏడుస్తుంది. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి అని ముకుంద అడగటంతో కృష్ణ ముకుంద చెంప పగలగొడుతుంది. ఏం చేశావే ఏసీపీ సార్‌ని అని గొంతు పట్టుకుంటుంది. ఇదంతా తనే చేసింది అని చెప్పండి ఏసీపీ సార్ దీన్ని ఇక్కడే చంపేస్తా.


మురారి: నాకు యాక్సిడెంట్ అయితే ఈ మీరానే ఇక్కడికి తీసుకొచ్చింది.
కృష్ణ: మీరా కాదు ఏసీపీ సార్ ముకుంద.
మురారి: నీకు ఎప్పుడు తెలిసింది.
కృష్ణ: మీ కంటే ముందే ఏసీపీ సార్. కానీ మీతో చెప్తే మన బిడ్డను చంపేస్తా అని బెదిరిస్తే చెప్పలేదు. ఇది మన బిడ్డను అడ్డం పెట్టుకొని చేసిన అన్యాయాలు ఇన్నీ అన్నీ కావు.
మధు: కృష్ణ నాకేం అర్థం కావడం లేదు. తను మీరా కదా. ముకుంద అంటావ్ ఏంటి.
కృష్ణ: ఈ మీరా ముకుంద మధు. 
మధు: నువ్వు ముకుందనా.. నువ్వు ముకుందనా.. 
ముకుంద: అవును నేను ముకుందనే..
మధు: వెటకారంగా వావ్ ఇది మామూలు షాక్ కాదు. అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు. ఇలాంటివి సినిమాల్లోనే చూస్తాం.  రియల్ లైఫ్‌లో అదీ నాఇంట్లో అస్సలు నమ్మలేకపోతున్నా. 
కృష్ణ: అసలు నువ్వేం ఆడదానివి. ఒక మగాడి కోసం ఇంతకు తెగిస్తావా.
ముకుంద: ఇంకా తెగిస్తాను. అది ఎంత వరకు అనేది వాళ్లకి తెలుసు.
కృష్ణ: ఏం చేస్తావ్ ఏమైనా అంటే బిడ్డను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావ్. ఇంకా రూపు దాల్చని బిడ్డను అడ్డం పెట్టుకొని భయపెడుతున్నావే సిగ్గు లేదు. 
ముకుంద: మురారి కోసం పిండం అయినా అండం అయినా బ్రహ్మాండమైనా దేన్ని అయినా అడ్డం పెట్టుకుంటా.
కృష్ణ: నోర్ముయ్. నువ్వు నిజంగా ఏసీపీ సార్‌ని ప్రేమించి ఉంటే ఇలా ఇక్కడ పడేసేదానివి కాదు మంచి హాస్పిటల్‌లో చేర్పించేదానివి. ఛీ..
ముకుంద: నాకు నా మురారి దక్కడం ముఖ్యం. అది ఎలా అయినా సరే. ఏ పరిస్థితిలో అయినా సరే.
మధు: ఏయ్ ఆపు ఏంటి మురారి మురారి.. నిన్ను తగలబెట్టినా కూడా మురారి అని జపం మానవా.కృష్ణ ఇది బిడ్డను అడ్డం పెట్టుకొని బెదిరిస్తుంటే నువ్వు ఎలా భయపడ్డావ్. పెద్ద పెద్దమ్మకు ఒక్క మాట చెప్పుంటే సరికదా బిడ్డ మీద కాదు కదా దీని మీద దీనికే ఆధీనం లేకుండా చేసుండేది. 


మధు భవానికి విషయం చెప్తాను అంటే కృష్ణ వద్దు అనేస్తుంది. మురారిని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటుంది. ముకుంద ఒప్పుకోను అంటే మధు సీరియస్ అవుతాడు. బిడ్డను అడ్డం పెట్టుకొని బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను మురారి, కృష్ణ కాదు అంటాడు. నువ్వు ఎలాంటి ఆడదానికి అయినా ఆదర్శ్ తాళి కట్టిన భార్యవి అని వరసకు వదిన అవుతావు అని మాటలతో చెప్పాను అని అడ్డు తప్పకపోతే చేతలతో చెప్పాల్సి వస్తుందని అంటాడు.


మురారిని హాస్పిటల్‌లో చేర్చుతారు. మరోవైపు భవాని కూడా కృష్ణ దోషనిర్దోషాలు తేల్చడానికి వెళ్తున్నాను అని రేవతితో చెప్తుంది. అంటే కృష్ణ తప్పు చేసిందని నమ్ముతున్నావా అక్క అని రేవతి అడుగుతుంది. అన్ని విషయాలు కాసేపట్లో తేలిపోతాయని భవాని అంటుంది. ఇక మురారికి హడావుడిగా ట్రీట్మెంట్ ఇస్తారు. మురారి కండీషన్ గురించి డాక్టర్ కృష్ణని తిడతారు. ఇంకో నాలుగు రోజులు ఆలస్యం అయింటే మురారి మంచానికే పరిమితం అయ్యే వాడని డాక్టర్ చెప్తుంది. కృష్ణ మురారి దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. ముకుంద ఎంతకైనా తెగిస్తుందని దాన్ని పెద్ద పెద్దమ్మ ముందు నిలబెట్టాల్సిందని అంటాడు. ముకుంద ఎక్కడికైనా పారిపోతుంది అని మధు అంటే వెళ్లదని దాని ఆఖరి ఊపిరి వరకు మురారి చుట్టే తిరుగుతుందని కృష్ణ అంటుంది. 


మురారి భవానిని చూడాలి అంటాడు. ఇప్పుడు వద్దు అని కృష్ణ అంటుంది. పరిస్థితి బట్టి చెప్తామని అంటుంది. మరోవైపు భవాని డాక్టర్ వైదేహి దగ్గరకు వెళ్తుంది. భవానిని చూసి వైదేహి షాక్ అయిపోతుంది. డాక్టర్ చదువుకున్నది ఇలాంటి మోసాలు అన్యాయాలు చేయడానికా.. మీరా ఎవరో నీకు తెలీదా అని సీరియస్ అవుతుంది. వైదేహి తెలీదు అంటే భవాని అబద్ధం చెప్తే ఇదే హాస్పిటల్‌లో ఐసీయూలో చేరుతావని అంటుంది. భవానికి భయపడిన వైదేహి మీరా తన ఫ్రెండ్ అని సరోగసీ చేశాను అని నిజం చెప్పేస్తుంది. 


ఇక కృష్ణ మధులు ఇంటికి వస్తారు. కృష్ణ, మధులో రేవతితో సంతోషంగా ఉండమని చెప్తారు. తాను సంతోషంగా ఉన్నాను అని ఆ సంతోషం కళ్లలో కనిపిస్తుంది కదా అని అంటుంది. రేవతి మురారి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. చెప్తాను అంటూ నవ్వుతున్న కృష్ణ ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోతుంది. మధు డాక్టర్‌కి కాల్ చేస్తాడు. ఇక భవాని వచ్చి చూసి కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మురారి తప్పు చేశాడని ఒప్పుకున్న కృష్ణ.. ముకుంద ట్యాబ్లెట్స్‌లో మురారికి సంబంధించినవి చూసి షాక్!