Krishna Mukunda Murari Today Episode: ఇంట్లో కృష్ణ, ముకుంద అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కృష్ణ భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి అడుగుతుంది. దాంతో కృష్ణ అందరూ ఏమీ పట్టనట్లు ఎలా తినగలుగుతున్నారని ప్రశ్నిస్తుంది. దానికి ఆదర్శ్ మీ మొగుడు పెళ్లాలు చేసిన పనికి మమల్ని పస్తులుండమంటావా అని ప్రశ్నిస్తాడు. భవానిని కూడా ప్రశ్నిస్తుంది. భవాని సమాధానం చెప్పకపోవడం 


కృష్ణ: ఎవరు ఏం మాట్లాడటం లేదు ఏంటి అత్తయ్య. అందరూ నన్ను దోషిలా చూస్తున్నారా. నేరస్తురాలిలా ముద్ర వేస్తున్నారా. పెద్దత్తయ్య అడుగుతుంది మిమల్నే. తను నా బిడ్డను మోస్తుంది అని చెప్తున్నా. మోసం చేస్తుంది అని చెప్తున్నా. ఎవరూ నా మాట నమ్మకుండా దాన్ని పక్కనే కూర్చోపెట్టుకొని తింటున్నారు. 
శకుంతల: పక్కన కూర్చొని తింటే నమ్మినట్లు కాదు కృష్ణ. అలా అయితే నీతో కలిసి భోజనం చేస్తున్నాం కదా అంటే నీ మీద నమ్మకం ఉన్నట్లే కదా.
ముకుంద: అదంతా ఏం కాదు అంటీ మీరంతా నన్ను అసహ్యించుకొని నన్ను ఓ నేరస్తురాలిగా చూడటమే కృష్ణకు కావాలి.
కృష్ణ: చూడటం ఏంటే నువ్వు నేరస్తురాలివే. నా భర్తని దక్కించుకోవడానికి నా బిడ్డని నీ కడుపులో పెట్టుకున్నావ్. నా భర్తతో లేని సంబంధాన్ని నిజం చేయాలి అని చూస్తున్నావ్ నువ్వు నేరస్తురాలివే. 
ముకుంద: కృష్ణ నేను నీకు ఏం అన్యాయం చేశాను ఇలా వేధిస్తున్నావు. అయినా తల్లి కాబోతున్న నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి. నేను ఇలా బాధ పడుతుంటే నా కడుపులో బిడ్డ ఏం కావాలి.
కృష్ణ: ఓసేయ్ నీ నంగనాచి మాటలు ఆపవే. ఒక పక్క నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలీదు. మరో వైపు మీరు ఎవరూ నా మాట వినడం లేదు. నేను ఏమైపోతాను అత్తయ్య. అర్జెంటుగా ఓ ప్లేస్‌కి వెళ్లాలి మధు, అత్తయ్య మీరు నాతో రండి.
భవాని: ఎవరూ ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. అసలు ఏమనుకుంటున్నావ్ కృష్ణ నువ్వు. నా ప్రయత్నాలలో నేను ఉన్నాను. నిజానిజాలు తేల్చుతాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఎవరిది తప్పు అయితే వాళ్లని మాత్రం వదలను. 


మధు: ఎప్పుడూ టెన్షన్‌గా ఉండే పెద్ద పెద్దమ్మ నేను తేల్చుకుంటాను అని అంత కచ్చితంగా అంటుంది అంటే ముకుంద, మురారిల గురించి తెలుసుకొని ఉంటుందా. కృష్ణ కాపీ తీసుకొని వస్తుంది. కృష్ణ రాత్రి నువ్వు నన్ను పెద్దమ్మని ఎక్కడికి తీసుకెళ్లాలి అనుకున్నావ్.
కృష్ణ: నేను చెప్పేది ఎవరూ నమ్మడం లేదు కదా అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. (కృష్ణ ఆదర్శ్‌కి కాఫీ ఇస్తే చిరాకుగా చూస్తూ వెళ్లిపోతాడు. ఇక ఇంట్లో మిగతా వాళ్లకి కాఫీ ఇస్తుంది. ముకుందకు పాలు ఇస్తుంది. పొద్దున్నే ఇంత ప్రేమ చూపిస్తుందేంటి అని ముకుంద అనుకుంటుంది.) అందరూ నీ మీద సానుభూతి చూపిస్తూ ఇష్ట పడుతున్నారు కదా. నేను మాత్రం ఎందుకు ద్వేషించాలి. నన్ను చూడకుండా ఏసీపీ సార్ ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఉన్నారు అంటే నువ్వు చెప్పేది నిజం అని నమ్మడంలో తప్పు లేదు. 
శకుంతల: అంటే మురారి తప్పు చేశాడు అని నువ్వు నమ్ముతున్నావ్ కదా కృష్ణ.
కృష్ణ: అందరూ నమ్ముతున్నారు కదా చిన్నత్తయ్య. నమ్మకపోతే ఏసీపీ సార్ ఏమైపోయారు అనే టెన్షన్ ఉండేది కదా. అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏసీపీ సార్ తప్పు చేసి ముఖం చూపించలేకే కదా దాక్కున్నారు అని అనుకుంటున్నారు. ఏసీపీ సార్ ఎక్కడున్నారో ఈ ఇంట్లో ఎవరో ఒకరికి కచ్చితంగా తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారు. అందుకే నేను నీ మీద కోపంగా ఉండటం తప్పు. అవును ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకుంటున్నావా. ఏం వేసుకుంటున్నావో ఏంటో ఇంట్లో డాక్టర్ ఉండి కూడా నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. ఒకసారి నువ్వు వేసుకునే ట్యాబ్లెట్స్ తీసుకురా.
ముకుంద: థ్యాంక్స్ కృష్ణ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావ్. ఇప్పుడే తీసుకువస్తా.
కృష్ణ: అత్తయ్య ఇన్ని రోజులు కన్న కొడుకు కనిపించకపోతే మీరు ఎలా ఉంటున్నారు. పెద్దత్తయ్యకు ఏసీపీ సార్ అంటే ప్రాణం కదా పెద్దత్తయ్య ఎందుకు ఊరుకుంటున్నారు.
భవాని: కృష్ణ పిచ్చి పిచ్చిగా వాగావు అంటే నీ మీద ప్రేమ అంతా పక్కన పెట్టేసి చెంప పగలకొడతా. అన్నీ తెలిసి నీకు చెప్పడం లేదా..



ఇంతలో ముకుంద ట్యాబ్లెట్స్ పట్టుకొని వస్తుంది. కృష్ణ చూసి మంచిగా వాడమని చెప్తుంది. ముకుంద కృష్ణ దగ్గరకు వెళ్లి ముందే కాంప్రమైజ్ అయింటే ఇంత ప్రాబ్లమ్ ఉండేది కాదు కదా అని అంటుంది. మధు కృష్ణని నిలదీస్తాడు. మురారి తప్పు చేశాడు అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. అయితే కృష్ణ మధుకి కొన్ని ట్యాబ్లెట్స్ చూపించి ఇవి ముకుంద దగ్గర తీసుకున్నా ఇవి ఏవైనా గాయాలు అయితే ఎముకుల కోసం వాడే ట్యాబ్లెట్లు అని చెప్తుంది. ఇది మీరా దగ్గర ఎందుకు ఉన్నాయి అని అంటాడు. ఎవరో ఫ్యాక్చర్‌ అయిన వాళ్ల కోసం ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంది అని అది మురారి కోసమేనా అని అనుమాన పడుతుంది. మురారి వచ్చే పరిస్థితి ఉంటే ఇంతవరకు రాకుండా ఉండరని అంటుంది. ఇక మధు కూడా ముకుంద మాటి మాటికి బయటకు వెళ్తుందని తనని వెంట పడాలి అని అనుకుంటారు. ఇక ముకుంద మురారికి మందులు ఇవ్వాలి అని బయల్దేరుతుంది. భవానిని చూసి ముకుంద ఆగుతుంది. హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లా అని ముకుంద చెప్తే కృష్ణ చూసుకుంటుంది కదా అని అడుగుతుంది. కవర్ చేసి ముకుంద మురారి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్‌, లక్ష్మీల పెళ్లి గురించి చలమయ్య దగ్గర బాధ పడిన వసుధార.. అర్జున్ ఇంటికి లక్కీ!