Andhra Pradesh News Today: సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత హాట్‌గా మారుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌, కౌంటింగ్ నేపథ్యంలో జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్ అయింది. టీడీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో వైసీపీ రెండు రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టింది. ఇందులో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం ఇదే! ఆ 4 నియోజకవర్గాల రిజల్డ్స్‌ కోసం రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే
తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశం ఏపీ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఓట్ల లెక్కింపు జూన్ 4న మొదలుకానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్లలెక్కింపు ఎలా సాగుతుంది. ఏయే ఫలితాలు ఎప్పుడొస్తాయన్నది ఒకసారి చూద్దాం. కట్టుదిట్టమైన భద్రత నడుమ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేసీఆర్ ముద్ర చెరిపేయాలా - తనదైన ముద్ర వేయాలా ? రేవంత్ రెడ్డికి దారేది ?
తెలంగాణలో ఇప్పడు గేయం, చిహ్నం, విగ్రహం రాజకీయాలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి తెలంగాణ తెచ్చిన..ఇచ్చిన  క్రెడిట్ తమ పార్టీకే ఇచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ చిహ్నం, గీతం, విగ్రహాలను మార్చేస్తున్నారు. ఇలా మారుస్తామని ఆయన ఇప్పుడే కాదు.. మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఇది సరైన సమయమేనా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


లుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్, రెండు మూడు రోజుల్లో రుతు పవనాల రాక
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురు అందించింది. కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు(Southwestern Monsoon) ముందుకు సాగుతున్నాయి. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని రెండు మూడు రోజుల్లో అంటే జూన్ 2 లేదా 3 తేదీల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'షాపులు క్లోజ్, ముందే అన్నీ తెచ్చిపెట్టుకోండి' - ఎన్నికల కౌంటింగ్ క్రమంలో అక్కడి ప్రజలకు పోలీస్ శాఖ అలర్ట్
మే 13న పోలింగ్ సందర్భంగా అనంతరం పల్నాడు (Palnadu) జిల్లాతో సహా అనంతపురం, తిరుపతి జిల్లాలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్లో టీడీపీ, వైసీపీ వర్గాల వారికి అధిక సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ నిరంతరం పహారా కాస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి