ABP  WhatsApp

Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం- భారీగా ప్రాణ నష్టం!

ABP Desam Updated at: 10 Oct 2022 02:44 PM (IST)
Edited By: Murali Krishna

Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.

(Image Source: Twitter/@MattiMaasikas)

NEXT PREV

Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా మిసైల్స్ ప్రయోగించిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి BNO న్యూస్‌కు తెలిపారు.


భారీ పేలుళ్లు


కీవ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. భారీ శబ్దంతో కీవ్‌లో పేలుళ్లు సంభవించినట్లు AP న్యూస్ తెలిపింది. ఎంతమంది మృతి చెందారనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. 






ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోలో కూడా పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.


నగరమంతటా క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.



మమ్మల్ని నాశనం చేయడానికి రష్యా ప్రతిజ్ఞ చేసింది. ఉక్రెయిన్‌ను భూమి నుంచి తుడిచిపెట్టడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ వ్యాప్తంగా క్షిపణి దాడులతో రష్యా బీభత్సం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఏం చేసినా సరే రష్యా మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. మా దేశం కోసం మేం ప్రాణత్యాగానికైనా సిద్ధం.                             - వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు


ఇటీవల


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన అణు హెచ్చరికలపై ఉక్రెయిన్ స్పందించింది. పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.



రష్యా అధినేత పుతిన్ ఇటీవల చేసిన హెచ్చరికలను బుకాయింపుగా భావించడం లేదు. పుతిన్‌ గతంలో ఏదో బుకాయింపుగా ఈ తరహా హెచ్చరికలు చేసి ఉండొచ్చు. కానీ, ఇప్పుడవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య ఉక్రెయిన్‌లోని రెండు అణు ప్లాంట్ల సమీపంలో రష్యా చేసిన దాడులను న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిల్‌కు సంకేతాలుగా పరిగణించవచ్చు.                                                          "
-వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు



Also Read: Mulayam Singh Yadav Death: 'కాకలు తీరిన యోధుడు- రాజకీయ చదరంగంలో కురువృద్ధుడు'


Also Read: Mulayam Singh Yadav Death: 'ఆయన మరణం నన్ను బాధిస్తోంది'- మోదీ సహా ప్రముఖుల సంతాపం

Published at: 10 Oct 2022 01:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.