2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారశంఖారావం పూరించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లఖింపుర్ ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాశీ విశ్వనాథుని క్షేత్రం, దుర్గా ఆలయంలో ఈ సభకు ముందు పూజలు చేశారు.
ముందుగా ఈ ర్యాలీకి 'ప్రతిజ్ఞ' అని పేరుపెట్టినప్పటికీ అనంతరం 'కిసాన్ న్యాయ ర్యాలీ'గా మార్చారు. దుర్గా మాత శ్లోకంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ప్రియాంక. భాజపా పాలనలో న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకోవడం లేదన్నారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్..
లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కూడిన ఏడుగురు సభ్యుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా అక్టోబర్ 9న రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్, ప్రియాంక, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది.
Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?