Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఓ పని పార్టీని ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారి నుంచి జోడో యాత్ర కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోయేసరికి అతనిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. అయితే ఆ యాత్ర కోసం రూ.2 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కొల్లాంలో ఓ వ్యాపారిని డిమాండ్ చేశారు. కానీ ఆ కూరగాయల వ్యాపారి రూ.500 మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
కాంగ్రెస్ రియాక్షన్
ఈ ఘటనపై కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఇది అల్లరిమూకలు చేసిన పని అని వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ నేరుగా ప్రజలను కలిసి, వారి సమస్యలను వింటున్నారని పార్టీ పేర్కొంది.
జోడో యాత్ర
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయటం లేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటున్నారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేస్తున్నారు.
Also Read: Lucknow Wall Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!
Also Read: Watch Video: ఈ వీడియో చూడండి- హెల్మెట్ విలువ తెలుస్తుంది!