M.S. Subbulakshmi:


కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని తెల్లవారుజామున “సుప్రభాతం” తో మేలుకోలుపే స్వరం. “జ్యో అచ్యుతానంద” అని నిదుర పుచ్చే స్వరమూ అదే. ఆ గొంతులో లో ఒక పవిత్రత , దైవత్వం, ఆమె కీర్తనలు వింటుంటే ఒక స్వాంతన భావన కలుగుతుంది. దైవ చింతన లేని వారు సైతం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఆలపించిన  స్తోత్రాలను వింటే భక్తులుగా మారిపోతారేమో. ఈ రోజు  (సెప్టెంబరు 16) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జయంతి 


పాట, స్తోత్రం, కీర్తన ఏదైనా..ఏ భాషలో ఉన్నా అర్థం, ఉచ్ఛారణ  తెలుసుకుని భావం మనసులోకి అనువదించుకుని లీనమై పాడే అంకితభావం సుబ్బులక్ష్మిది. ప్రేక్షకులు కొట్టే చప్పట్లపై ధ్యాస కాకుండా...తాదాత్మ్యంతో పాడటం వల్ల ఆ గానం అజరామరమయింది. మరే గాయకులకూ సాధ్యం కానంత పేరు ప్రతిష్ఠలు పొందినా అవేమీ పట్టనంత నిరాడంబర స్వభావం ఆమెది.  ఆమె పలికే తెలుగు పదాల్లో ఉచ్ఛారణ దోషాలున్నాయని బెంగుళూరు నాగరత్నమ్మ చేత మాట అనిపించుకున్న సుబ్బులక్ష్మి .. సాధన చేసి ఆ లోపం సవరించుకుంది. ఐదేళ్ళ తర్వాత అదే వ్యక్తి చేత ప్రశంసలు పొందింది. వేంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం ..ఇంకా ఎన్నో ఎన్నెన్నో...


ఎంతో పేరు వచ్చినా 66 సంవత్సరాల వయసులోనూ నాలుగు గంటల కచేరీ ఇవ్వటానికి మూడు గంటలపాటు సాధన చేయటం ఆమె అంకితభావానికి నిదర్శనం. కచేరీ చేసే ప్రతిసారీ ఎలా చేస్తానో అని ఆందోళనపడటం, ఆపై అత్యద్భుతంగా కచేరీ కొనసాగించటం ఆమెకు అలవాటయిన విషయం. 72 ఏళ్ళ వయసులో నిత్యవిద్యార్థిలా 72 మేళకర్త రాగమాలికను నేర్చుకుని, రికార్డు చేసింది. నిద్ర, తిండి లాంటి కనీస అవసరాలకు తప్ప రోజంతా సాధన చేసిన సందర్భాలెన్నో...


తమిళనాడు మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది సుబ్బులక్ష్మి. చిన్నారి సుబ్బులక్ష్మిని ఆమె తల్లి ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకునేవారు. ఆమెకు తల్లి ఆది గురువు. పదేళ్ళ వయస్సులో సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. ఏ కారణం లేకుండా తనను టీచరు కొట్టిందనే కోపంతో బడికి వెళ్ళడం మానేసారు చిన్నారి సుబ్బులక్ష్మి. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది. తన ప్రతిభతో అనతి కాలంలోనే భారతజాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమై..సంగీత ప్రియులను తన మధుర స్వరంతో ఓలలాడించింది. ఆమె ఆహార్యం ఎన్నటికీ మరువరానిది. నుదుటిని కుంకుమతో..తలలో ఎప్పుడూ మల్లెపూలతో గొంతెత్తి పాడుతున్న ఆమె ఆహార్యం భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది. 11 డిసెంబర్ 2004లో చెన్నై కన్నుమూశారు సుబ్బులక్ష్మి.


భజగోవిందం


అధరం మధురం భావములోనా భాహ్యము నందును...


 


భావములోనా భాహ్యము నందును...


క్షీరాబ్ధికన్యకకు.....


 



విష్ణు సహస్రం


డోలాయాం...



ఎందరో మహానుభావులు...అందరికి వందనములు.....Also Read: ఆశ్వయుజాన్ని శక్తిమాసం అంటారెందుకు , శరన్నవరాత్రులు ఎందుకంత పవర్ ఫుల్!


Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!