Watch Video: ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడండి.. అంటు ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. అయితే యాక్సిడెంట్ జరిగే సమయాల్లో హెల్మెట్.. రైడర్ ప్రాణాలను కాపాడిన ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. అయితే తాజాగా దిల్లీ పోలీసులు షేర్ చేసిన ఓ వీడియో అందర్నీ ఆకర్షిస్తుంది.
రెండు సార్లు
దిల్లీ పోలీసులు షేర్ చేసిన వీడియోలో కొన్ని సెకన్ల తేడాలో రెండుసార్లు ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇందుకు కారణం హెల్మెట్. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ బైకర్.. కారు నుంచి తప్పించుకోబోయి సమీపంలో ఉన్న వీధి దీపం స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోతాడు. కింద పడ్డా కూడా అతనకి పెద్దగా ఏం దెబ్బలు తగలవు. సాధారణంగానే లేచి నిలబడతాడు. తలకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతని ప్రాణాలకు ఏమీ కాలేదు.
అయితే లేచి నిలబడేలోగా ఆ రైడర్‌కు మరో షాక్ తగిలింది. తన బైక్ ఢీకొనడం వల్ల ఆ స్తంభం కింద పడింది. సరిగ్గా ఆ బైకర్ లేస్తున్న సమయంలోనే అది అతని తలపై కూలింది. అయితే హెల్మెట్ ధరించి ఉండడం వల్ల లక్కీగా మళ్లీ అతని ప్రాణాలు మిగిలాయి.
వైరల్
ఈ వీడియోను దిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. హెల్మెట్ పెట్టుకున్నవాళ్లను దేవుడు రక్షిస్తాడని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో
మరోవైపు పంజాబ్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని బెహ్రాం దగ్గర లారీ అతివేగంతో అదుపు తప్పి కారు మీద బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 18 టైర్లున్న ఓ భారీ ఇసుక లారీ అతి వేగంలో టర్న్ తీసుకొని బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న రెండు కార్ల మీద ఆ లారీ బోల్తా పడింది. అయితే ఆ కారుపై లారీ బోల్తా పడడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఫగ్వారా -చండీఘడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో దంపతులు, వారి కుమారుడు ఉన్నారు. వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Also Read: Odisha News: ఫుల్లుగా తాగి ASP వీరంగం- మహిళలతో అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్!
Also Read: PM Modi Birthday Special: BJP బంపర్ ఆఫర్- మోదీ బర్త్‌డేకు బంగారు ఉంగరాలు, చేపలు పంపిణీ!