ABP  WhatsApp

Lucknow Wall Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!

ABP Desam Updated at: 16 Sep 2022 01:34 PM (IST)
Edited By: Murali Krishna

Lucknow Wall Collapse: లఖ్‌నవూలో భారీ వర్షానికి ప్రహారీ గోడ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు.

(Image Source: PTI)

NEXT PREV

Lucknow Wall Collapse:  ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. శిథిలాల నుంచి ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. 







కొంతమంది కార్మికులు దిల్‌కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్‌క్లేవ్ వెలుపల గుడిసెలలో నివసిస్తున్నారు. రాత్రిపూట భారీ వర్షాల కారణంగా ఆ ప్రహారీ గోడ కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే మేం తెల్లవారుజామున 3 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాం. శిథిలాల నుంచి 9 మృతదేహాలను వెలికి తీశాం. ఓ వ్యక్తిని సురక్షితంగా కాపాడగలిగాం.                           - పీయూష్ మోర్డియా, జాయింట్ పోలీస్ కమిషనర్, లా అండ్ ఆర్డర్


పరిహారం


గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.  



లఖ్‌నవూలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ ఎన్‌క్లేవ్ ప్రహారీ గోడ కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారు సాధారణ కార్మికులు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్నారు. గోడ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నాం.                - బ్రజేష్ పాఠక్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి






ఇక ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు.


Also Read: Watch Video: ఈ వీడియో చూడండి- హెల్మెట్ విలువ తెలుస్తుంది!


Also Read: Odisha News: ఫుల్లుగా తాగి ASP వీరంగం- మహిళలతో అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్!

Published at: 16 Sep 2022 01:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.