Alappuzha Collector: కేరళలో అరుదైన ఘటన జరిగింది. ఓ జిల్లా కలెక్టర్ తన భర్తకే ఆ బాధ్యతలు అప్పగించారు. అవును.. అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా ఇన్నాళ్లూ పని చేసిన డా. రేణు రాజ్.. ఆ బాధ్యతలను తన భర్త శ్రీరామ్‌కు అప్పగించి వెళ్లిపోయారు.
బదిలీ వల్ల
ఇన్నాళ్లూ అలెప్పీ (అలప్పుజ) కలెక్టర్‌గా పనిచేసిన డా. రేణు రాజ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను నియమించింది. అయితే రేణు, శ్రీరామ్ ఇద్దరూ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వీరిద్దరూ ముందు వైద్యులు. అయితే ఆ తర్వాత ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు.
నిరసనలు
కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా ఇప్పటివరకు శ్రీరామ్ పనిచేశారు. మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ బదిలీని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శ్రీరామ్‌కు అలప్పుజ కలెక్టర్ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుబడుతూ యూడీఎఫ్ కార్యకర్తలు కలక్టరేట్ బయట ఆందోళన చేపట్టారు.
ఇదే కారణం
గతంలో శ్రీరామ్ వెంకట్రామన్‌పై ఓ కేసు నమోదైంది. 2019లో శ్రీరామ్ కారులో వేగంగా వెళ్తూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మృతి చెందారు.
ఈ కేసులో బెయిల్ పొందిన శ్రీరామ్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీరామ్‌ను కేరళ ప్రభుత్వం 2020లో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ పోస్టు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: SC on Money Laundering: సోదాలు, అరెస్ట్‌లు కరక్టే- ఈడీ అధికారాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Also Read: Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం- వీడియోలు చూస్తే షాకవుతారు!