Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. ప్రకంపనలకు ప్రజలు భయంతో పరుగులు తీశారు.
భారీగానే
లుజోన్ ప్రధాన ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ అబ్రానులో బుధవారం ఉదయం 8:43 గంటలకు భూకంపం సంభవించింది. రాజధాని మనీలా నగరానికి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఎత్తైన టవర్లు ఈ భూకంపం వల్ల కంపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియలేదని అధికారులు తెలిపారు.
ఫిలిప్పైన్స్‌లో ప్రతి ఏటా భూకంపాలు వస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాలలో ఒకటిగా ఫిలిప్పైన్స్ ఉంది.
Also Read: Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?
Also Read: SC on Political Parties Freebies: 'ఉచిత హామీలు ఇవ్వడం సీరియస్ అంశం- కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు?'