Stock Market Opening Bell 27 July 2022: రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్ల లాభంతో 16,539 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 203 పాయింట్ల లాభంతో 55,472 వద్ద ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,266 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,258 వద్ద మొదలైంది. 55,157 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 203 పాయింట్ల పెరిగి 55,472 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,483 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,473 వద్ద ఓపెనైంది. 16,438 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,541 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 55 పాయింట్ల లాభంతో 16,539 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 36,370 వద్ద మొదలైంది. 36,248 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,558 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 119 పాయింట్ల లాభంతో 36,527 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, గ్రాసిమ్, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్, సిప్లా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, కొటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఆటో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, రియాల్టీ సూచీలు ఎగిశాయి.