SC on Political Parties Freebies: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత హామీలు, అసంబద్ధమైన వాగ్దానాలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై ఓ వైఖరి తీసుకునేందుకు కేంద్రం ఎందుకు సంకోచిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
ఈ మేరకు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్‌ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండడానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి హామీలు ఇచ్చే పార్టీల చిహ్నాలను స్తంభింపజేసి, నమోదును రద్దు చేసేందుకు ఉన్న అధికారాలను ఈసీ వాడేలా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దీనిపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read: Brothel Case: సెక్స్ రాకెట్ కేసులో ఆ రాష్ట్ర BJP ఉపాధ్యక్షుడు అరెస్ట్
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 18 వేల మందికి వైరస్